ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, బోజ్ పురి సహా పలు పరిశ్రమలు ఉన్నాయి.భాషలో సినిమాలు మంచి విజయం సాధించినా.
ఆయా సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్ చేస్తారు.సినిమాలో మంచి కథ, కథనం బాగుంటే చాలా ఆటోమేటిక్ గా ఆ సినిమాలు మిగతా భాషల్లోకి చేరిపోతూనే ఉంటాయి.
అలాగే తెలుగులో సూపర్ హిట్ కొట్టిన సినిమాలను బాలీవుడ్ లోకి రీమేక్ చేశారు.వాటిలో సల్మాన్ నటించిన ఏడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టాయి.ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
*జుడ్వా – హలో బ్రదర్
1997లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన జుడ్వా సినిమా ఓ రేంజిలో విక్టరీ కొట్టింది.డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలలో సల్మాన్ హీరోగా చేయగా.రంబ, కరీష్మా హీరోయిన్లుగా చేశారు.ఈ సినిమా 1994లో తెలుగులో రిలీజై విజయం సాధించిన హలో బ్రదర్ రీమేక్ మూవీ కావడం విశేషం.
*లవ్ – ప్రేమ
1991లో సల్మాన్ హీరోగా చేసిన సినిమా లవ్.ఈ సినిమా సైతం బాలీవుడ్ లో మంచి విజయాన్ని దక్కించుకుంది.ఈ సినిమా 1989లో వెంకటేష్, రేవతి నటించిన ప్రేమ చిత్రానికి రీమేక్.
*దిల్ నే జిసే అప్నా కహా – నీ తోడు కావాలి
సల్మాన్ హీరోగా భూమిక, ప్రీతి జింటా హీరోయిన్లు గా చేసిన మూవీ దిల్ నే జిసే అప్నా కహా.ఈ మూవీ సైతం మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తెలుగులో వచ్చిన నీతోడు కావాలి సినిమాకు రీమేక్ మూవీ.ఈ సినిమా ద్వారానే చార్మీ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది.
*వాంటెడ్ – పోకిరి
సల్మాన్ నటించిన సూపర్ హిట్ మూవీ వాంటెడ్.ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించాడు.ఆయేషా టకియా హీరోయిన్ గా చేసింది.ఈ సినిమా తెలుగులో పూరీ జగన్నాథ్ నటించిన పోకిరీకి రీమేక్.
*రెడీ – రెడీ
సల్మాన్ ఖాన్, అసిన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రెడీ.అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా హిందీలో మంచి విజయం సాధించింది.తెలుగులో రామ్, జెనీలియా నటించిన రెడీ సినిమాకు ఈ మూవీ రీమేక్.
*జై హో – స్టాలిన్
సోహెల్ ఖాన్ దర్శకత్వంతో సల్మాన్ హీరోగా వచ్చిన సినిమా జై హో.ఈ సినిమాలో టబు, డైసీ హీరోయిన్లుగా చేశారు.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.తెలుగులో చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాకు ఈ సినిమా రీమేక్.
*కిక్ – కిక్
సాజిద్ నాడియా దర్శకత్వంలో సల్మాన్ హీరోగా కిక్ సినిమా తెరకెక్కింది.రణదీప్ హుడా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీరోల్స్ చేశారు.బాలీవుడ్ లో హిట్ కొట్టిన ఈ సినిమా.తెలుగులో రవితేజ, ఇలియానా నటించిన కిక్ సినిమాకు రీమేక్.