ఈ మధ్య కాలంలో కొందరు డబ్బు కోసం ఎంతటి ఘాతుకానికైనా పాల్పడుతున్నారు.ఈ క్రమంలో కట్టుకున్న వారిని సైతం వ్యభిచారంలో దించడానికి ఏ మాత్రం ఆలోచించడం లేదు.
కాగా తాజాగా ఓ వ్యక్తి తాను చేసిన వ్యాపారాల కారణంగా ఆర్థికంగా నష్టపోవడంతో ఆ అప్పులను తీర్చునేందుకు తన భార్య ప్రియుడిని వాడుకోవడంతో చివరికి కథ అడ్డం జరిగిన ఘటన ముంబై పరిసర ప్రాంతంలో వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక నగరంలో “తుషార్” అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు.కాగా తుషార్ కుటుంబ పోషణ నిమిత్తమై పలు వ్యాపారాలు చేసి కొంతమేర ఆర్థికంగా నష్టపోయాడు.సరిగ్గా ఇదే సమయంలో తుషార్ భార్య బాగా డబ్బు ఉన్నటువంటి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఈ విషయం తెలుసుకున్న తుషార్ ఆమెపై కోపడకుండా తెలివిగా ఆలోచించి తన ఆర్థిక పరమైన సమస్యలను తీర్చుకోవాలని పన్నాగం పన్నాడు.ఇందులో భాగంగా తన భార్యని ఎరగా వేసి ప్రియుడితో 10 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలని లేకపోతే వీడియోలు, ఫోటోలు, ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాలని సూచించాడు.
దీంతో తుషార్ భార్య తన భర్త చెప్పినట్లు చేసింది.దాంతో బిత్తరపోయిన తన ప్రియుడు వెంటనే తన వద్ద ఉన్నటువంటి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి తనపై పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని మరియు తన ఫోటోలు వీడియోలు, డిలీట్ చేయాలని కోరాడు.
అయినప్పటికీ తుషార్ మాత్రం తన భార్య ప్రియుడి మాటలు అసలు వినలేదు.తనకు పది లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు.అంతేకాకుండా ఈ బెదిరింపులు మరింత స్ట్రాంగ్ గా ఉండాలని ఓ నకిలీ పోలీస్ తో ఫోన్ చేయించి మరీ బెదిరించాడు.దాంతో ప్రియుడు తన బంధువుల ద్వారా స్థానికంగా ఉన్న పోలీసులను సంప్రదించి ఈ విషయం గురించి తెలియజేశాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డబ్బు తీసుకోవాలని పిలిపించి తుషార్ మరియు తన భార్యని అలాగే నకిలీ పోలీసుని అదుపులోకి తీసుకున్నారు.అలాగే వివాహేతర సంబంధాలు మానవ జీవితంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయని మరోమారు ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా తుషార్ ప్రియుడిని హెచ్చరించి వదిలేశారు.
తుషార్ మరియు తన భార్య ని మాత్రం వన్ ఆర్థికపరమైన మోసాలకు పాల్పడడం మరియు బ్లాక్ మెయిల్ చేయడం వంటి వాటి కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి పెట్టారు.