అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ కలెక్షన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఇక అల్లు అర్జున్ కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది.
ఈ సినిమాలోనే పాటలు ఇండియన్ వైడ్ గా రికార్డ్ సృష్టించాయి.ఓ విధంగా చెప్పాలంటే త్రివిక్రమ్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్ రికార్డ్ తో పాటు అంతగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే అల వైకుంఠపురంలో మూవీ అనే చెప్పాలి.
ఇక ఈ మూవీని హిందీలో రీమేక్ చేయడానికి చాలా నిర్మాణ సంస్థలు ముందుకొచ్చి భారీ ఆఫర్స్ చేశాయి.అయితే గీతా ఆర్ట్స్ నేరుగా ఈ మూవీని హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అయ్యింది.
అయితే ఎవరి దర్శకత్వంలో అనే విషయం అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు.కాని హీరో, హీరోయిన్స్ మాత్రం ఖరారైపోయారు.
ఇక ఈ మూవీలో హీరోగా యంగ్ సెన్సేషన్ కార్తిక్ ఆర్యన్ ని ఫైనల్ చేశారు.మొదటి నుంచి ఈ మూవీ కోసం అతని పేరే వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా హీరోయిన్ పాత్ర కోసం కృతి సనన్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతూ ఉండటంతో పాటు పూజా హెగ్డే తరహాలోనే పొడుగుకాళ్ల సుందరి అనే విషయం అందరికి తెలిసిందే.
ఈ నేపధ్యంలో వీరిద్దరి జోడీ పెర్ఫెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నట్లు టాక్.ఇక ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, అలాగే క్యాస్టింగ్ సెలక్షన్ కూడా చేస్తున్నట్లు టాక్.
అంతా అయ్యాక కరోనా పరిస్థితి నార్మల్ అయిన తర్వాత సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు.ఇక దర్శకుడు ఎవరనే విషయంలో మాత్రం గీతా ఆర్ట్స్ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.