వెండితెరపై పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో ఎక్కువగా నటించి ప్రణీత నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.వేర్వేరు కారణాల వల్ల ప్రణీత గత ఆదివారం రోజున అభిమానులకు చెప్పకుండానే బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.
అయితే కొత్త పెళ్లికూతురు ప్రణీత తాజాగా ఒక విషయంలో హర్ట్ అయ్యారు.ప్రణీత హర్ట్ కావడానికి ముఖ్యమైన కారణమే ఉంది.
ఇండియాలో చెత్త భాష ఏదనే ప్రశ్నకు గూగుల్ కన్నడ భాష అని చూపించడంతో గూగుల్ సమాధానంతో ప్రణీత హర్ట్ కావడంతో పాటు గూగుల్ పై ఫైర్ అయ్యారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో ఒకరైన ప్రణీత గూగుల్ సమాధానంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రణీతతో పాటు పలువురు కన్నడిగులు కూడా ఫైర్ కావడంతో చివరకు గూగుల్ తప్పును సరి చేసుకుంది.లాక్ డౌన్ సమయంలో ప్రణీత ఆకలితో అలమటిస్తున్న వాళ్ల ఆకలిని తీర్చారు.
నటిగా కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ప్రణీత పేదలకు సహాయం చేయడం ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఊహించని స్థాయిలో పెంచుకున్నారు.

మెజారిటీ సందర్భాల్లో సరైన సమాధానం చెప్పే గూగుల్ కొన్ని సందర్భాల్లో పొరబడటం వల్ల తప్పుగా సమాధానాలను ఇస్తుందనే సంగతి తెలిసిందే.ప్రణీత మాతృభాష కన్నడ కావడం వల్ల ఆమె అభిమానులపై ఫైర్ అయ్యారు.
కన్నడ భాష దేశంలోని అత్యంత ప్రాచీనమైన భాషలలో ఒకటని ఈ భాష ఎంతో చరిత్ర ఉన్న భాష కావడంతో పాటు క్వీన్ లాఫ్ లాంగ్వేజ్ అంటూ ప్రణీత కన్నడ భాష గొప్పదనాన్ని వెల్లడించారు.

గూగుల్ క్షమాపణలు కోరడంతో ఈ వివాదం సద్దుమణిగింది.మరోవైపు కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్న ప్రణీత కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత పెద్ద పార్టీ ఇవ్వాలని భావిస్తున్నారు.