సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్పేద చిన్నారుల ఆకలి తీర్చే ప్రయత్నం సాయిదత్త పీఠం సేవా కార్యక్రమాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది.సాయి చెప్పిన సేవా మార్గాన్ని కూడా సాయి దత్త పీఠం తన కర్తవ్యంగా భావిస్తోంది.
ఈ క్రమంలోఆటా( అమెరికన్ తెలుగు అసోసియేషన్) సంస్థతో కలిసి సాయి దత్త పీఠం ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది.సాయి దత్త పీఠం వాలంటీర్లు, హైస్కూల్ విద్యార్ధులు తమలోని సేవా భావాన్ని చాటుతూ ఈ ఫుడ్ డ్రైవ్ లో పాల్గొన్నారు.
తమ ఇరుగు, పొరుగువారితో పాటు స్నేహితుల ఇళ్ల నుంచి ఫుడ్ ఐటమ్స్ సేకరించారు.ఇలా సేకరించిన ఆహారాన్ని పేద పిల్లలకు అందించనున్నారు.
పేదరికం కారణంగా అర్థాకలితో ఉండే పేద పిల్లలకు ఆహారాన్ని అందించాలనే సాయి దత్త పీఠం సంకల్పాన్ని అందరూ అభినందించారు.సాయి దత్త పీఠం సేవా దళ సభ్యులతో పాటు స్థానిక దాతలు లావణ్య, జగదీశ్ యలమంచిలి ఈ కార్యక్రమానికి తమ మద్దతు అందించారు.
చారిటీ టీం సభ్యురాలు శుభ పాటిబండ్ల చొరవతో దిశా గార్గ్ తో పాటు పలువురు ఎస్.డి.పి వాలంటీర్స్ కూడా ఈ కార్యక్రమానికి తన వంతు సాయం చేశారు.ఇంత మంచి సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమానికి న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల, సాయి దత్త పీఠం కార్యనిర్వాహక సభ్యులు అశోక్ బడ్డీ, మురళీ కృష్ణ మేడిచెర్ల, శుభ పాటిబండ్ల, వంశీ గరుడ, ఆటా రీజియన్ కోఆర్డినేటర్స్ సంతోష్ రెడ్డి, ప్రదీప్ కట్టా, ప్రవీణ్ ఆళ్ల, ఆటా సేవా టీం కోచైర్ విలాస్ జంబు తదితరులు పాల్గొన్నారు.