అయ్యయ్యో: ఇటుకల బట్టీలో పనిచేస్తున్న అంతర్జాతీయ ఫుట్​బాలర్..​!

ట్యాలెంట్‌కు బ్యాక్ గ్రౌండ్‌తో ప‌నిలేద‌ని ఎంతోమంది నిరూపించారు.త‌మ ప్ర‌తిభ‌తో ప్ర‌పంచ ఖ్యాతిని గ‌డించారు.

 International Footballer Sangeeta Soren Working In Brick Factory , Football Play-TeluguStop.com

అయితే అంత‌ర్జాతీయ ఫుట్ బాల‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఈ ఝార్ఖండ్ అమ్మాయి సంగీత సోరెన్ కూడా త‌న ప్ర‌తిభ‌తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది.ఎన్నో అవార్డుల‌ను ద‌క్కించుకుంది.

అయితే ఇదంతా గ‌తం మాత్ర‌మే.

ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఇటుకల బట్టీలో కూలీగా రోజూ పనిచేస్తోంది.

కుటుంబాన్ని పోషించేందుకు అష్ట కష్టాలు మోస్తోంది.ఏ ప‌ని దొరికితే దానికి వెళ్లి త‌న కుంటుంబం క‌డుపు నింపుతోంది.

అయితే ఆమె దుస్థితిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరగింది.దీంతో ఈ విష‌యం కాస్తా కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరెన్ రిజిజు వ‌ర‌కు చేరింది.

దీనిపై ఆయ‌న స్పందించారు.సోరెన్‌ను ఆదుకుంటామని, పూర్తి ఆర్థిక సాయం అంద‌జేస్తామని ప్ర‌క‌టించారు.

సంగీత సోరెన్ ఒక‌ప్పుడు మ్యాచులు, గ్రౌండ్ల‌లో కాలం గ‌డిపేది.అండర్-18లో ఇండియా టీమ్ త‌ర‌ఫున ఆడింది.ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉంది.2018లో థాయ్​లాండ్​తో అండర్-19 టోర్నీలో ఆడింది.అలాగే అదే ఏడాది భూటాన్​లో అండర్-18 మ్యాచులో ఆడిన సోరెన్ మంచి ప్ర‌తిభ క‌న‌బ‌ర్చింది.

Telugu Carona Effect, Foor Palayer, Sangeeta Soren, Kiran Rizizu, Latest, Brick

దీంతో గతేడాది ఆమెకు జాతీయ సీనియర్ జట్టులో స్థానం లభించింది.అయితే ఆ మ్యాచుల గురించి ఆమెకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆడ‌లేక‌పోయింది.

మ్యాచులు ఆడితే ఇంట్లో వాళ్ల‌మీద ఆధార‌ప‌డేది కాదు.

కానీ ఇప్పుడు టోర్నీలు లేక‌పోవ‌డం, లాక్‌డౌన్ కార‌ణంగా ఆమె పరిస్థితి దారుణంగా తయారైంది.నాన్నకు కండ్లు క‌నిపించ‌వ‌పోవ‌డంతో ఇల్లు గడవడం కూడా క‌ష్టంగా మారింది.

దీంతె త‌న అన్నయ్యతో కలిసి తాను కూడా కూలి పనులకు వెళ్తోంది.అన్న నిర్మాణ కూలీగా పని చేస్తున్నాడు.

అక్కడ కూడా సరిగా డబ్బులు ఇవ్వట్లేదు.అందుకే మా ఊరు బాన్స్​మురిలోనే ఇటుకలు మోసే రోజు కూలీకి పోతున్నాను.

అయితే మళ్లీ ఫుట్​బాల్​ ఆడతాననే ఆశ ఉంది.దగ్గర్లో ఉండే ధన్ బాద్ స్టేడియంలో అప్పుడ‌ప్పుడు ప్రాక్టీస్​కు వెళ్తున్నా అని సోరెన్ చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube