టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఐశ్వర్యారాయ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు.పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్యారాయ్ ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నారు.
అయితే ఈ స్టార్ హీరోయిన్ తల్లికి సర్ప్రైజ్ ఇచ్చారు.తల్లి పుట్టినరోజు కావడంతో ఐశ్వర్యా రాయ్ భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి తల్లి వింద్రా రాయ్ ను కలిశారు.
నిన్న వింద్రా రాయ్ పుట్టినరోజు కాగా కూతురు ఇంటికి రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
నువ్వే మా ప్రపంచం, పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఐశ్వర్యారాయ్ తల్లికి బర్త్ డే విషెస్ చెప్పారు.
ఐశ్వర్యారాయ్ తల్లితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఆరాధ్య, వింధ్యారాయ్ కలిసి దిగిన ఫోటో మిగతా ఫోటోలతో పోలిస్తే హైలెట్ గా నిలుస్తుండటం గమనార్హం.
నిన్నటితో వింధ్యారాయ్ 70వ వసంతంలోకి అడుగు పెట్టారు.
కరోనా నిబంధనలను పాటిస్తూ కూతురు, అల్లుడు, మనవరాలుతో కలిసి వ్రిందారాయ్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.వ్రిందారాయ్ కోసం ఐశ్వర్య ఏకంగా మూడు అందమైన కేక్ లను తెప్పించారు.అమ్మను ఎంతగానో ప్రేమిస్తున్నానని భగవంతుడు అమ్మను చల్లగా చూడాలని కోరుకుంటున్నానని ఐశ్వర్యారాయ్ తెలిపారు.
ఐశ్వర్య ఫోటోలను షేర్ చేసిన తరువాత సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం వ్రిందా రాయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఐశ్వర్యారాయ్ నటిగా ఎదగడంలో వ్రిందా రాయ్ పాత్ర ఎంతో ఉంది.
తల్లి ప్రోత్సాహంతో ఐశ్వర్యారాయ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు నటిగా ఊహించని స్థాయికి ఎదిగారు.ఐశ్వర్యారాయ్ లా ఆరాధ్య కూడా భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.