వైరల్: ఆ మమ్మీ మగ మమ్మీ కాదట.. గర్భవతి మమ్మీ అట..!

మనం సాధారణంగా పురాతన కాలంలో మమ్మీలని అక్కడ ఇక్కడ కనుగొన్నామని వార్తల్లో వినే ఉంటాం.కానీ ఎప్పుడు వాటి గురించి వినడమే తప్ప చాలా మంది వీక్షించి ఉండరు.

 Viral That Mommy Is A Male Mommy Pregnant Mommy Egyptian,mummy,pregnant, Woman,-TeluguStop.com

తాజాగా ఒక మమ్మీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.రీసెర్చ్ లో భాగంగా ఆ మమ్మీ ని కంప్యూటర్ టెస్ట్ ద్వారా మొదట ఆ మమ్మీని మగ అని అనుకున్నారు.

కానీ ఆ తర్వాత అసలు విషయం బయటపడింది అక్కడ ఉన్నది గర్భవతి మమ్మీ అని మొట్టమొదటి సారిగా గర్భవతి అయిన పురాతన మమ్మీని కనుగొనడం అని తెలియజేస్తూన్నారు ఆ పరిశోధకులు. వాస్తవానికి కోఫిన్ మీద “ male priest ” అని రాశారు.

కానీ అది నిజం కాదు అది మగ మమ్మీ కాదని గర్భవతి అయిన మమ్మీ అని తేలింది.

ఇలా ఎలా కనిపెట్టారన్న విషయానికి వస్తే.

మొదటగా ఆ మమ్మీకి పురుషాంగాలు లేవు.అదే విధంగా పొడవైన జుట్టు, స్తనముల ఆధారంగా మహిళ అని గుర్తించారు పరిశోధకులు.

అలాగే చిన్న పాదం, చిన్న చేతులు కూడిన ఫీటస్ ఉండడం గుర్తించినట్లు ఆర్కియాలజిస్టు తెలియజేస్తున్నారు.ఇక ఆ మమ్మీ  వయసు దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండవచ్చని, కడుపులో ఉండే బిడ్డ ఆధారంగా 26-28 వారాల గర్భవతి అని అర్థమవుతోంది.

ఈ కథనాన్ని మొత్తం ప్రముఖ జర్నల్ ఆఫ్ ఆర్కియాలజీ సైన్స్ లో పబ్లిష్ చేయడంతో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube