మహారాష్ట్రలో కరోన విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.చైనా నుండి ఇతర దేశాలకు వైరస్ వ్యాపించిన క్రమంలో ఇండియా లో ఎంటర్ అయ్యాక మొదటి నుండి మహారాష్ట్ర పైనే ఈ వైరస్ దాడి ఎక్కువగా ఉంది.
కరోనా వచ్చిన ప్రారంభంలో, కరోనా సెకండ్ వేవ్ లో అత్యధికమైన కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి.ప్రస్తుతం మహారాష్ట్రలో రోజుకి 50 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా ఇప్పటికే సీఎం ఉద్ధవ్ ఠాక్రే లాక్ డౌన్ విధించటం తెలిసిందే.అయినా గాని కేసులు కంట్రోల్ లోకి రాకపోవటంతో ఈ రోజు రాత్రి 8 గంటల నుండి మే ఫస్ట్ వరకు రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ రిజిస్టర్ 144 సెక్షన్ అమలు చేసింది.
లాక్ డౌన్ సమయం లో అత్యవసర సేవలు మినహా.మిగతా కార్యక్రమాలు అంతా బంద్ చేయాలని ప్రభుత్వం తెలిపింది.దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర ముందు ఉండటంతో.కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది.
మహారాష్ట్రలో కరోనా రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా .ఎప్పటికప్పుడు ఆక్సిజన్ ట్యాంకర్లు పంపిస్తోంది.దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు వివరాలు చూస్తే మొదట మహారాష్ట్ర తరువాత ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక.