మొటిమలు..
యువతీ, యువకులను తీవ్రంగా వేధించే చర్మ సమస్యల్లో ఇది ఒకటి.ఆహారపు అలవాట్లు, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, ఆయిలీ ఫుడ్స్ మరియు జంక్ ఫుడ్స్ అతిగా తీసుకోవడం, మృత కణాలు ఇలా రకరకాల కారణాల వల్ల మొటిమలు ఏర్పడుతుంటాయి.
ఇక ఎంత అందంగా, తెల్లగా ఉండే ముఖాన్ని అయినా నాశనం చేసే మొటిమలను తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ నానా తంటాలు పడుతుంటారు.క్రీములు, లోషన్లు వాడతారు.
కానీ, ఎటువంటి ఖర్చు లేకుండా చాలా ఈజీగా అందరి ఇంట్లో ఉండే గంజితోనే మొటిమలను నివారించుకోవచ్చు.సాధారణంగా చాలా మంది అన్నం వండిన తర్వాత వచ్చే గంజి పడబోస్తారు.
కానీ, గంజిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.అందుకే పూర్వం గంజిని పడబోయకుండా.
తాగేసేవారు.ఇక చర్మానికి కూడా గంజి చేసే మేలు ఎంతో.
ముఖ్యంగా మొటిమలను వదిలించుకునేందుకు గంజి అద్భుతంగా ఉపయోగపడుతుంది.మరి గంజిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందులో ఒక గిన్నెలో గంజి మరియు ఇంట్లో తయారు చేసుకున్న రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దూది సాయంతో ముఖానికి అప్లై చేయాలి.
రాత్రి పడుకునే ముందు ఇలా చేసి.ఉదయాన్నే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ప్రతి రోజు ఇలా చేస్తే మొటిమలు మటుమాయం అవుతాయి.మరియు మొటిమల కారణంగా ఏర్పడిన ఎరుపు మచ్చలు, వాపు, దురదలు కూడా తగ్గుతాయి.
అలాగే గంజిని డైరెక్టర్‌గా ముఖానికి అప్లై చేసి.అర గంట తర్వాగ కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడంతో పాటు.ముడతలను కూడా నివారించి చర్మాన్ని స్మూత్ గా మరియు అందంగా మారుస్తుంది.
గంజి ముఖానికి అప్లై చేయడం వల్ల.చర్మ కాంతి కూడా రెట్టింపు అవుతుంది.