సాధారణంగా ఉదయం లేవగానే చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది.వాటి వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయి అన్నది పక్కన పెడితే.
ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను తీసుకుంటే మీ శరీరంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటాయి.ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ నుంచి స్కిన్ గ్లో వరకు ఎన్నో ఊహించని ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పావు టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు, ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో అర అంగుళం దంచిన అల్లం ముక్క, నాలుగు దంచిన యాలకులు వేసుకోవాలి.
అలాగే పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, చిటికెడు మిరియాల పొడి వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ తో సహా వేసుకుని మరో ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
ఆపై స్టౌ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపితే మన టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ సిద్ధమవుతుంది.
ఉదయం టీ, కాఫీలకు బదులుగా ఈ సాఫ్రాన్(కుంకుమపువ్వు) డ్రింక్ ను తీసుకుంటే వేగంగా వెయిట్ లాస్ అవుతారు.
చర్మం కాంతివంతంగా, యవ్వనంగా మారుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుంది.
ఆస్తమా సమస్య ఉంటే దాని నుంచి విముక్తి లభిస్తుంది.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
మరియు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.ఇన్ని అద్భుత ప్రయోజనాలను అందించే ఈ డ్రింక్ ను తప్పకుండా మీ డైట్ లో చేర్చుకోండి.