నాకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది... కానీ డైరెక్టర్ వల్ల...

తెలుగులో ఒకప్పుడు శుభలగ్నం, ఆడది, కన్నయ్య కిట్టయ్య, మిస్టర్ పెళ్ళాం, ఘరానా బుల్లోడు, వంశోద్ధారకుడు, మావి చిగురు, తదితర ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ “ఆమని” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి ఆమని స్వతహాగా కన్నడ భాషకు చెందిన నటి అయినప్పటికీ ఆమెకి తెలుగులోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది.

 Actress Aamani React About Her Heroine Chance In Riskhavodu Movie, Riskhavodu Mo-TeluguStop.com

కాగా నటి ఆమని ఈ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని మెగాస్టార్ చిరంజీవిపై తనకు ఉన్న అభిమానం గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎనలేని అభిమానమని, అంతేకాక తాను 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచే మెగాస్టార్ చిరంజీవిపై క్రష్ ఉండేదని చెప్పుకొచ్చింది.

తన చిన్నప్పుడు చిరంజీవి హీరోగా నటించిన “ఖైదీ” చిత్రాన్ని మొదటగా బెంగుళూరులోని ఓ సినిమా థియేటర్లో చూశానని అప్పటి నుంచి తనకు చిరంజీవిపై అభిమానం ఏర్పడిందని తెలిపింది.దీంతో అప్పుడప్పుడు తన ఇంట్లో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులతో మెగాస్టార్ చిరంజీవి ఫోటోలను కొనుక్కొని పుస్తకాలలో దాచుకునే దానినని అంతగా మెగాస్టార్ అంటే పిచ్చి అంటూ చిరంజీవి పై ఉన్న అభిమానం గురించి తెలిపింది.

కాగా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన రిక్షావోడు చిత్రంలో తనకు హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని, కానీ అనుకోకుండా ఆ చిత్రానికి దర్శకుడు మారిపోవడంతో తనని కూడా తీసేశారని తెలిపింది.దీంతో మెగాస్టార్ చిరంజీవితో నటించాలనే తన కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయిందని కనీసం ఇకముందైనా తనకు చిరంజీవి నటించే అవకాశం వస్తుందని ఆశా భావం వ్యక్తం చేసింది.

ఈ విషయం ఇలా ఉండగాపెళ్లయిన తర్వాత ఆమని దాదాపుగా ఎనిమిది సంవత్సరాలపాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంది.ఆ తరువాత తెలుగులో “దేవస్థానం” అనే చిత్రం ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది.

దీంతో నటి ఆమని వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.కాగా ఇటీవలే ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ హీరోగా నటించిన “చావు కబురు చల్లగా” చిత్రంలో హీరో తల్లి పాత్రలో కనిపించింది.

అలాగే ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రంలో హీరో తల్లి పాత్రలో కూడా నటిస్తోంది.అలాగే నటుడు జగపతి బాబుతో కలిసి వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube