కొందరి జీవితాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు చూడాల్సిన స్థాయినీ చూసిన తర్వాత అనుకోకుండా జరిగిన సంఘటనల వల్ల మళ్లీ వాళ్లు చాలా అధమ స్థితికి వెళ్లిపోతారు అలాంటి వారే హీరో సుమన్.ఒకప్పుడు చిరంజీవి లాంటి హీరో స్టార్ హీరోగా ఎదుగుతున్నప్పుడు చిరంజీవికి పోటీ ఇవ్వగల ఏకైక వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా అంటే అందరూ చెప్పే ఏకైక పేరు సుమన్.
సుమన్ అయితేనే చిరంజీవికి గట్టిపోటీ ఇవ్వగలడు అని అందరూ భావించారు.చిరంజీవి హిట్ కొడుతున్నాడు అంటే సుమన్ అంతకుమించిన హిట్స్ కొట్టి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు.
సుమన్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అంటే హీరో భానుచందర్ సినిమాల్లో వేషాలు వేస్తూ హీరోగా చేస్తున్న టైంలో సుమన్ భానుచందర్ ఇద్దరు ఫ్రెండ్స్.వీళ్లిద్దరు మార్షల్ ఆర్ట్స్, కరాటే లాంటివి నేర్చుకున్నారు సినిమాల్లో బిజీగా ఉన్న భానుచందర్ అప్పుడు సుమన్ తో నువ్వు కూడా చూడడానికి అందంగా ఉన్నావ్ నీకు కూడా మార్షల్ ఆర్ట్స్ వచ్చు కాబట్టి నువ్వు కూడా ఇండస్ట్రీకి రా అని సజెస్ట్ చేశాడు.
మొదట్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపని సుమన్ తర్వాత సినిమాల్లోకి రావాలి అనుకొని యాక్టింగ్ కి సంబంధించిన మెళకువలు నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చాడు.అయితే సుమన్ కి మొదట్లో డాన్స్ వచ్చేది కాదు డాన్స్ క్లాసులకు వెళ్లి డాన్స్ కూడా నేర్చుకున్నాడు తరంగిణి, దేశంలో దొంగలు పడ్డారు లాంటి సినిమాల్లో భానుచందర్, సుమన్ ఇద్దరు హీరోలుగా నటించి మంచి హిట్స్ సాధించారు.
సోలో హీరోగా కూడా సుమన్ మంచి హిట్స్ అందుకున్నారు ఆ టైం లోనే చిరంజీవికి పోటీ ఎవరైనా ఇవ్వగలరా అనుకున్న టైంలో సుమన్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యేది.కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అన్నట్టుగా సుమన్ కొన్ని కేసుల్లో ఇరుక్కుని అనుకోకుండా జైలుకు వెళ్లి కొన్ని రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మానసికంగా కొంత కృంగి పోయినప్పటికీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ గా సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు.
సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్దింటి అల్లుడు, బావమరిది, అలెగ్జాండర్ లాంటి సినిమాలు చేసి మంచి హిట్స్ సాధించాడు.ఆ తర్వాత కారు దిద్దిన కాపురం లాంటి సినిమా తీసిన రచయిత డి.వి.నరసరాజు ఆయన వాళ్ల మనవరాలిని సుమన్ కి ఇచ్చి పెళ్ళి చేశాడు దీంతో ఇండస్ట్రీలో ఉన్న పెద్దాయన సుమన్ కి వాళ్ళ మనవరాలును ఇచ్చి పెళ్లి చేయడంతో ఇండస్ట్రీలో ఉన్న అందరూ సుమన్ చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడని అందుకే నరసరాజు గారు వాళ్ళ మనవరాలును ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అంటే సుమన్ చాలా మంచి మనిషిని ఆయన ఏ తప్పూ చేయలేదని ఇండస్ట్రీ మొత్తం భావించింది అప్పటి నుంచి సినిమాలు చేస్తూ వస్తున్నారు.కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన అన్నమయ్య సినిమాలో సుమన్ వెంకటేశ్వర స్వామి పాత్ర చేశాడు ఆ పాత్ర చేయడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి ఆ సినిమా లో సుమన్ నీ చూస్తున్నంత సేపు వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టుగా అనిపించేది.
ఈ క్యారెక్టర్ తో సుమన్ కి మంచి పేరు వచ్చింది ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు వచ్చాయి.
ఆ తర్వాత మళ్లీ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామదాసు సినిమా లో రాముడి పాత్రను పోషించి ఆ పాత్రని సుమన్ తప్ప ఇంకెవరూ చేయలేరు ఒకవేళ చేసిన వేరే వాళ్ళు న్యాయం చేయలేరు అన్నంత గొప్పగా సుమన్ ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారు.
అలాగే తమిళంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన శంకర్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా వచ్చిన శివాజీ సినిమా లో విలన్ పాత్ర చేసి తనకి హీరోగానే కాదు విలన్ గా కూడా చేయగల సత్తా ఉందని నిరూపించిన నటుడు సుమన్.మొత్తానికి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, దేవుని వేషాలు కూడా వేస్తూ మంచి గుర్తింపు సాధించిన సుమన్ నిజంగా గ్రేట్ అని చెప్పాలి.