సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ నటించిన నటీనటుల మధ్య ప్రేమ చిగురించి ఆ తర్వాత పెళ్లి చేసుకొని విడిపోయిన దంపతులు చాలామంది ఉన్నారు.ప్రేమ పుట్టడం పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం అన్ని కామన్ అయినప్పటికీ ఫాన్స్ మాత్రం కొంత మంది స్టార్స్ విడాకులను చాల సీరియస్ గా తీసుకున్నారు.
వారంతా విడిపోవడం అభిమానులకు చాల బాధను సైతం మిగిలించింది.వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం
ఇండియాలో నవరసాలు నటించి మెప్పించగల ఏకైక నటుడు కమలహాసన్ ఆయన చేసిన సాగర సంగమం, శుభ సంకల్పం లాంటి సినిమాల్లో ఆయన నటన ఎంత బాగుంటుందో మనం చూడొచ్చు.
దశావతారాలు అనే సినిమాలో 10 క్యారెక్టర్లు చేసి అన్ని క్యారెక్టర్లు చేయగల సత్తా ఇండస్ట్రీలో తనకు మాత్రమే ఉంది అని మిగతా హీరోలకు సవాల్ విసిరిన వ్యక్తి కమల్ హాసన్ కమల్ హాసన్ విశ్వరూపం సినిమా కూడా డైరెక్షన్ చేశాడు ఆ సినిమాతో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ విశ్వరూపం ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమా గా నిలిచింది.అయితే కమల్ హాసన్ సినిమాలలో చాలా పెద్ద నటుడు అయినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం ఆయన జీవితం అంత సాఫీగా లేదనే చెప్పాలి ఎందుకంటే మొదటగా వాణి గణపతి అనే ఆవిడ ని పెళ్లి చేసుకున్నారు.
అయితే కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత వారి మధ్య వచ్చిన విభేదాలతో విడిపోయి ఆ తర్వాత నటి, కాస్ట్యూమ్ డిజైనర్, సౌండ్ ఇంజనీర్ అయిన సారిక నీ పెళ్లి చేసుకున్నాడు ఆమెకి శృతి హాసన్, అక్షరహాసన్ అని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
శృతిహాసన్ తెలుగులో ఎంత పెద్ద హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అనేది మనందరికీ తెలిసిందే రీసెంట్ గా వచ్చిన క్రాక్ సినిమాతో ఒక మంచి హిట్ కొట్టిందనే చెప్పాలి.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్ మూవీ లో హీరోయిన్ గా చేస్తోంది అయితే తర్వాత కమల్ హాసన్ కి సారిక కి మధ్య గొడవ జరగడంతో విడిపోయారు.చాలా రోజులు ఒంటరిగా ఉన్న కమల్ హాసన్ ఆ తర్వాత తనతో పాటు చాలా సినిమాల్లో నటించిన నటి గౌతమి తో సహజీవనం చేశారు.
గౌతమి గారికి ఒక అమ్మాయి కూడా ఉంది.కమల్ హాసన్, గౌతమి ,సారిక, గౌతమి కూతురు ,శృతి హాసన్, అక్షర హాసన్ అందరూ కలిసి ఉండేవారు అయితే కమలహాసన్ ప్రొడక్షన్ హౌస్ నీ స్టార్ట్ చేశారు దాంట్లో గౌతమి గారు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం మరియు శృతి హాసన్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉంటూ ఏ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి ఏవి వేసుకోకూడదు అని శృతి హాసన్ కి , అక్షర హాసన్ కి చెప్పడంతో వాళ్ళకి పెద్దగా నచ్చలేదు అయితే ఈ విషయానికి సంబంధించి ప్రొడక్షన్ పనులకు సంబంధించి గౌతమి గారి ఇన్వాల్వ్మెంట్ నచ్చలేదని కమల్ హాసన్ కి చెప్తే ఆయన కూడా వీళ్లకు సపోర్ట్ చేయడంతో గౌతమి కి నచ్చక నాకు కమల్ కి ఏ సంబంధం లేదని చెప్పి వాళ్ల నుంచి దూరమైపోయింది ప్రస్తుతం వాళ్లకి దూరంగా ఉంటుంది.
Sonia-Selva Raghavan
సెవెన్ జి బృందావన కాలనీ సినిమాతో ఒక మంచి దర్శకుడిగా గుర్తింపు పొందిన సెల్వరాఘవన్ అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన సోనియా గారి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.కానీ ఇద్దరి మధ్య కొన్ని కారణాల వల్ల గొడవలు జరగడం తో కోర్టుకెళ్లి విడాకులు తీసుకున్నారు.సెల్వరాఘవన్ తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాని చెశారు.సూర్య తమ్ముడు అయిన కార్తీ నీ హీరోగా పెట్టి యుగానికొక్కడు అనే సినిమాని తీశాడు.సెల్వరాఘవన్ ప్రముఖ హీరో అయిన ధనుష్ వాళ్ళ అన్నయ్య.
Sumanth-Keerthy Reddy
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుమంత్ మొదటి సినిమా అయిన ప్రేమ కథ సినిమా తో మంచి గుర్తింపు సాధించాడు.ఆ తర్వాత యువకుడు లాంటి సినిమాలో నటించి మెప్పించాడు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కీర్తి రెడ్డి ని సుమంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
పెళ్లైన రెండు సంవత్సరాలకే ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఇద్దరూ విడిపోయారు.విడిపోయిన తర్వాత కీర్తి రెడ్డి వేరే అతన్ని పెళ్లి చేసుకుని బెంగళూరులో సెట్ అయ్యారు.గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన అర్జున్ సినిమా లో కీర్తి రెడ్డి మహేష్ బాబు అక్క పాత్రలో నటించింది.
Pawan Kalyan-Renu Desai
ఇక టాలీవుడ్ లో ఇప్పటికి ఎవరు నమ్మని, ఇష్టం లేని విడాకులు ఎవరివైనా ఉన్నాయంటే అవి పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ వి.ఇప్పటికి రేణు ని పవన్ ఫాన్స్ వదిన అని పిలుస్తూ ఉంటారు.అంతలా ఆయన ఫాన్స్ ఆమెని ఓన్ చేసుకున్నారు.
కారణాలు ఏమైనా వీరి విడాకులు మాత్రం పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి చాల బాధను మిగిల్చాయి.