టాలీవుడ్‌లో స్టార్ నటీనటులు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే.అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రం రోజూవారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటారు.
కాగా సినిమాకు అతి ముఖ్యమైనా పాటలను ఆలపించే గాయనీగాయకులు ఎంతమొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటారా అనేది అందరిలో మెదిలే ప్రశ్నే.అయితే గతంలో టాలీవుడ్ పాటలకు పెద్ద దిక్కు అయిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందరు సింగర్స్ కంటే ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునేవారు.
కాగా ఆ తరువాత చాలా మందే కొత్త సింగర్స్ టాలీవుడ్‌లో తమ సత్తా చాటుకున్నా, బాలు రెమ్యునరేషన్‌ను ఎవరూ బీట్ చేయలేకపోయారు.ఆయన ఒక్క పాటకు రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల వరకు పుచ్చుకునేవారు.కానీ ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్న సింగర్‌గా యంగ్ ట్యాలెంట్ సిడ్ శ్రీరామ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న ఈ యువ సింగర్, వరుసగా సూపర్ హిట్ సాంగ్స్‌ను తన కెరీర్‌లో పాడుతూ దూసుకుపోతున్నాడు.
దీంతో అతడి క్రేజ్ అమాంతం ఓ రేంజ్‌కు వెళ్లిపోయింది.అయితే ప్రస్తుతం సిడ్ శ్రీరామ్ టాలీవుడ్‌లో వస్తున్న క్రేజ్ ఉన్న చిత్రాల్లో ఖచ్చితంగా ఒక్క పాటైనా పాడాలని ప్రేక్షకులు కూడా కోరుతున్నారు.దీంతో అతడు ఒక్కో పాటకు ఏకంగా రూ.6.5 లక్షలు పుచ్చుకుంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.ఈ రేంజ్‌లో ఓ సింగర్ రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే హయ్యెస్ట్ అని వారు అంటున్నారు.లోకల్ సింగర్స్ ఒక్కో పాటకు కేవలం రూ.15 వేల నుండి రూ.50 వేలు మాత్రమే తీసుకుంటుండగా, సిడ్ శ్రీరామ్ ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకోవడంతో ఆయనకు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.అయితే ఈ క్రేజ్‌ను మనోడు క్యాష్ చేసుకుంటున్నాడనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.