చాటుమాటు పెళ్ళిళ్ళు నేటితరం లోనే బాగా జరుగుతున్నాయి అనుకుంటున్నాం కానీ పాత కాలంలో కూడా సీక్రెట్ పెళ్లిళ్లు బీభత్సంగా జరుగుతూనే ఉండేవి.అలనాటి మహానటి సావిత్రి కాలం నుంచి ఇప్పటి వరకు సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్లకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వారు ఎందరో ఉన్నారు.
సావిత్రి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం తో ఆమె తన పెద్దనాన్న దగ్గర పెరిగింది.నాటకాలు ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆమె చిన్నతనంలోనే మద్రాసు వచ్చి అక్కడ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు.
అయితే జెమినీ గణేషన్ సహాయం వల్లనే తాను సినిమాల్లో అరంగేట్రం చేసి అగ్రతారగా ఎదిగానని సావిత్రి చెప్పేవారు.ఆయన దయ వల్లే తాను గొప్ప స్థాయిలో ఉన్నానని అందుకే అతడినే పెళ్లి చేసుకోవాలని సావిత్రి నిశ్చయించుకున్నారు.
ఆమె ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మైసూర్ లో జెమినీ గణేషన్ ని పెళ్లి కూడా చేసుకున్నారు.కానీ ఆమె పెళ్లి అట్టర్ ఫ్లాప్ కావడంతో సావిత్రి ఎంత బాధ పడుతూ తన చివరి రోజులు గడిపారు.
ఇక తల్లిదండ్రుల బలవంతంతో మొదటిసారిగా అలమేలు ని పెళ్లి చేసుకున్న జెమినీ గణేషన్ ఆ తర్వాత పుష్పవల్లి ని మొదటి భార్యకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు.ఆయన ఆమెతో కలిసి రేఖ వంటి స్టార్ హీరోయిన్ కి కూడా జన్మనిచ్చారు.
పుష్పవల్లి సహాయంతో ఆయన ఇండస్ట్రీలో ఎంతో పెద్ద స్థాయికి ఎదిగారు.ఆమెకు తెలియకుండా సావిత్రిని ఆయన మూడో పెళ్లి చేసుకున్నారు.
ఇక దివంగత నటీమణి, అతిలోక సుందరి శ్రీదేవి కూడా చాటు పెళ్లి చేసుకున్న వారే.ఈమె అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న బోనీకపూర్ ని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.కేవలం 20 మంది సమక్షంలోనే ఆమె బోనీ కపూర్ ని పెళ్లి చేసుకున్నారు.అయితే అప్పటికే శ్రీదేవి 5 నెలల గర్భవతి.ఆ తర్వాత ఆమె బోనికపూర్ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారని చెబుతుంటారు.నిండు నూరేళ్లు నిండకుండానే ఆమె దుబాయ్ లోని ఓ బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోయారు.
15 ఏళ్లకే నటిగా మారిన దివ్యభారతి బొబ్బిలి రాజా, రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ వంటి సినిమాల్లో నటించి ఎంతగానో మెప్పించారు.అయితే ఈమె కూడా తన చిన్నతనంలోనే అప్పటికే పెళ్ళయిన సాజిద్ నాడియాద్వాలా అనే ఒక డైరెక్టర్ ని రహస్యంగా వివాహం చేసుకున్నారు.కానీ ఆమె పెళ్లయిన ఒక సంవత్సరం లోనే బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కింద పడి పోయి చనిపోయారు.అప్పటికి ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలే.అయితే ఆమెను ఎవరో కావాలనే ప్లాన్ చేసి చంపేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.కానీ ముంబై పోలీసులు దర్యాప్తు చేసి ఆమె ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కిందపడి చనిపోయారు అని తేల్చారు.
చంద్రలేఖ సినిమా షూటింగ్ సమయంలో రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణ వంశీ తో పరిచయం పెంచుకున్నారు.ఆ తర్వాత 2003 ఆమె ఎవరికి తెలియకుండా రహస్యంగా కృష్ణవంశీని పెళ్లి చేసుకున్నారు.రాణి ముఖర్జీ, ఆదిత్య చోప్రా కూడా రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.నిజానికి ఆమె యష్ రాజ్ ఫిలిమ్స్ చైర్మన్ అయిన ఆదిత్య చోప్రా తో చాలా కాలం చాలా రహస్యంగా ప్రేమాయణం నడిపించారు.మీడియా వర్గాలు ఎన్ని సార్లు ప్రశ్నించినా తన ప్రేమ విషయం గురించి అసలు వెల్లడించలేదు.2014 లో ఇటలీలో అత్యంత సమీప బంధువుల సమక్షంలో ఆమె ఆదిత్య చోప్రా ని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.అయితే వీరిద్దరి వైవాహిక బంధం ఎటువంటి గొడవలు లేకుండా సాఫీగానే కొనసాగుతోంది.వీళ్ళిద్దరికీ అదిరా అనే ఒక కూతురు కూడా ఉంది.