దేశంలో గత పది రోజుల క్రితం మొదలైన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది.కొత్తలో ఈ వ్యాక్సిన్ పై కొన్ని అనుమానాలను వెలిబుచ్చిన, ప్రస్తుతం ఎలాంటి ఆటంకం లేకుండా కోవిడ్ 19 వ్యాక్సిన్ పక్రియ కొనసాగుతుంది.
కాగా కోవాగ్జిన్ డోసులను దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నారు.
ఓ వైపు ఈ వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతుండగానే, కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది.
ప్రపంచాన్ని టెన్షన్ పెట్టిన కొత్త రకం కరోనా వైరస్ అయిన యూకే కరోనా వెరియంట్‌పై తమ టీకా సమర్థవంతంగా పని చేస్తున్నట్టు పేర్కొంది.
ఇకపోతే చైనా లోని వూహాన్ నుండి వ్యాపించిన కరోనా వైరస్ కంటే బ్రిటన్‌లో కనుగొన్న కొత్త రకం కరోనా వైరస్ 70 శాతం వేగంగా విస్తరిస్తుందని గుర్తించిన శాస్త్రవేత్తలు, ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది తప్ప అంతగా ప్రాణాపాయం లేదని అభిప్రాయపడుతున్నారట.
ఇక కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొత్త రకం కరోనా వైరస్‌ను విజయవంతంగా నిలువరిస్తోందని భారత్ బయోటెక్ వెల్లడించడం ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచినట్లు అయిందని అనుకుంటున్నారట.