ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ జోరుగా ముందుకెళ్తోంది.తెలంగాణ ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్తున్న పరిస్థితి ఉంది.
ఈ సందర్భంగా బీజేపీ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రజల్లోకి వెళ్తోంది.
అంతేకాక ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుండడంతో టీఆర్ఎస్ కు భవిష్యత్తు పరీక్షగా ఉండనుంది.ఈ సందర్బంగా బీజేపీ ఒక విషయంలో మౌనంగా వ్యవహరిస్తోంది.
త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇంకా ఏ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలని ఒక నిర్ధారణకు రాలేదు.అయితే బీజేపీ ఈ విషయంలో కాస్త మౌనం పాటిస్తోంది.
టీఆర్ఎస్ లో ఎవరికి నాగార్జున సాగర్ అభ్యర్థిగా టికెట్ ఇస్తారనేది టీఆర్ఎస్ అత్యంత గోప్యంగా ఉంచుతోంది.అయితే బీజేపీ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరికి టికెట్ ఇస్తారనేది వేచి చూసి ఆ అభ్యర్థికి సరిసమానమైన వ్యక్తిని పోటీలో ఉంచే అవకాశం ఉంది.
ఏది ఏమైనా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.మరి బీజేపీ వ్యూహం టీఆర్ఎస్ ను ఇరుకున పెడుతుంటుందా లేదా అనేది ఎన్నికల ఫలితాలతో నిర్ధారణ కానుంది.
చూద్దాం భవిష్యత్తులో ఏమి జరుగుతుందనేది చూడాల్సి ఉంది.