వైరల్ వీడియో: మా నాన్నకు 27 మంది భార్యలు.. టీనేజర్!

మన ఇండియాలో ఒకరికి ఒక భార్య మాత్రమే ఉండాలి.ఇద్దరు భార్యలు ఉంటే చట్టపరంగా విరుద్ధం అది మనం అందరికీ తెలుసు.

 Canadian, Teen Tiktok, World Largest Polygamist, Cult Is Viral,social Media,neti-TeluguStop.com

సుప్రీంకోర్టు కూడా ఒక భార్య ముద్దు ఇద్దరు భార్యలు వద్దు అన్న కొటేషన్ కూడా పంపించింది.మొదటి భార్య చనిపోయిన తరువాత మరొక పెళ్లి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

అలా కాకుండా మొదటి భార్య ఉండగా రెండవ పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిని చట్టం పరిగణనలోకి తీసుకోదు.

కానీ కెనడాలో మాత్రం ఒక వ్యక్తికి 27 మంది భార్యలు.150 మందికి పైగానే పిల్లలు.ఈ ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక టీనేజర్ తన తండ్రి గురించి చెబుతున్న విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.దీనిపై నెటిజన్లకు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విషయంలోకి వెళితే కెనడాకు చెందిన మెర్లిన్ బ్లాక్ మూర్ అనే 19 ఏళ్ల యువకుడు టిక్ టాక్ వీడియో ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నాడు.మా నాన్నకి 27 మంది భార్యలు ఒక్కొఇంట్లో ఇద్దరు అంటూ తమ ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.తమ సొంత తల్లిని మామ్ అని పిలుస్తామని మిగతావారిని మదర్ అని పిలుస్తాము అని అతడు చెప్పాడు.తనకు 19 సంవత్సరాల వయసులోనే 150 మంది తోబుట్టువులు ఉన్నారు అని చెప్పుకొచ్చాడు.

వాళ్లందరినీ హోటల్ పోలిన ప్రత్యేక భవనం లో ఉంచుతారని చెప్పాడు.ఇద్దరు భార్యలకు ఒకే ఇంటి చొప్పున తన తండ్రి కేటాయించారని చెప్పుకొచ్చాడు.

నలుగురిలో నవ్వుల పాలు అవుతామని ఇన్నాళ్లు ఈ విషయాలను దాచి ఉంచామని చెప్పారు.ప్రస్తుతం మెర్లిన్ సోదరులిద్దరూ కుటుంబానికి దూరంగా అమెరికాలో నివసిస్తున్నారు.

ఎప్పటి నుంచి ఈ విషయాల గురించి చర్చించాలి అనుకుంటున్నాను అని ఇప్పుడు ఆ స్థితి కి వచ్చాను అని చెప్పారు.ఇప్పుడు తన ఫ్యామిలీ గురించిప్రపంచం మొత్తానికి తెలుస్తుందని వీడియోలు చెప్పుకొచ్చాడు.

ఇంత పెద్ద కుటుంబం కావడంతో తమకు కావాల్సిన ధాన్యాన్ని తాము పంచుకుంటాను అని చెప్పాడు మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 27 మంది భార్యలు సొంత అక్క చెల్లెలు కూడా ఉన్నారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube