కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ వారికీ సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.ఇలాంటి తరుణంలోనే కొంతమంది రాత్రికి రాత్రే స్టార్ అయిపోతూ నెటిజన్స్ ను బాగా అక్కటుకుంటున్న సందర్భాలు ఎన్నో.
సాధారణంగా అమెరికన్లకు భారతీయ పాటలు అంటే ఎంతో ఇష్టం.భారతీయ పాటలకు ఎంతోమంది అమెరికన్లు డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
అందుకు సంబంధించిన వీడియోస్ అప్పుడప్పుడు సోషల్ మీడియా ఖాతా పంచుకుంటూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.ఇలా ఎప్పటికప్పుడు తన డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటాడు రిక్కీ ఎల్ పాండ్.
గతంలో కూడా హృతిక్ రోషన్ సాంగ్స్ కు డాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు ఇతను.అలాగే ఎన్నో బాలీవుడ్ పాటలకు డాన్స్ వేస్తూ చిందులు చేశాడు రిక్కి.
తాజాగా ఒక ఓ ఫేమస్ భోజ్ పూరీ పాటకు తన కూతురుతో కలిసి సూపర్ గా స్టెప్పులేస్తూ ఆకట్టుకుంటున్నాడు.ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఆ వీడియోకు సింగర్ పవన్ సింగ్ ను కూడా ట్యాగ్ చేశాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్స్ స్పందిస్తూ వారి స్థాయిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.వీడియో చాలా బాగుందని మరి కొందరు స్పందిస్తూ ఉంటే.సరిగ్గా లిఫ్ట్ సింగ్ చేయడంపై పలువురు నెటిజన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.తండ్రి కూతురు ఇద్దరు కూడా “చాలా బాగా స్టెప్పులేశారు” అంటూ నెటిజన్స్ వారి స్టైల్ స్పందించారు.
ప్రస్తుతం తండ్రి కూతుర్ల డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.