అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో ట్రంప్ ఘోరమైన పరాజయం పాలైన తరువాత జరిగిన పరిణామాలు అమెరికన్స్ చూస్తూనే ఉన్నారు.యావత్ ప్రపంచం ట్రంప్ తీర్పుపై మండిపడుతోంది కూడా.
ఏకంగా క్యాపిటల్ భవనంపై దాడి ఘటన అందరిని ఆశ్చర్యపరిచింది.దాంతో రిపబ్లికన్ పార్టీ పై ప్రజలకు విరక్తి కలిగింది.
అసలు పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారనే విమర్శలు ఎదురయ్యాయి.అధ్యక్షుడి హోదాలో ఉన్న ట్రంప్ ఆగడాలకు ఎలా చెక్ పెట్టాలో అర్థం కాక సొంత పార్టీనే తలలు పట్టుకుంది.
ఈ నేపధ్యంలోనే ట్రంప్ పై డెమోక్రాట్లు పెట్టిన అభిశంసన రిపబ్లికన్ పార్టీలోని కొందరు నేతలకు మంచి అవకాశంగా దొరికింది.
ట్రంప్ పై పెట్టిన అభిశంసనలో ఆయన సొంత పార్టీ అయిన రిపబ్లికన్ లోని కొందరు నేతలు కూడా మద్దతు తెలిపారు.
ఈ సమయంలోనే బిడెన్ కు అధికారాలు అప్పగించే విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.క్యాపిటల్ పై దాడి ఘటన తరువాత తొలిసారిగా స్పందించిన మైక్ పెన్స్ బిడెన్ కు అధికారాన్ని అప్పగించడానికి మేము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తో సమావేశం అయిన మైక్ పెన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో కొంత ఊరటనిచ్చాయి…

అధ్యక్ష ఎన్నికలో విజయం సాధించిన జో బిడెన్ కు అమెరికా సాంప్రదాయం ప్రకారం భాద్యతలు అప్పగించడానికి మేము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి గొడవలకు తావు ఉండదని, అమెరికన్స్ కు మరింత గౌరవం వస్తుందని అన్నారు.బిడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని చెప్పిన ఆయన అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తీ చేశామని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు.తాజాగా మైక్ పెన్స్ చేసిన వ్యాఖ్యలతో అమెరికన్స్ ఫిదా అయ్యారట.
మైక్ ఎంతో బాధ్యతగా వ్యవహరించారని, ఉపాధ్యక్ష పదవికి గౌరవం ఇచ్చారని, ట్రంప్ కంటే బిడెన్ బెటర్ అంటూ నేట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారట.