ఒక కంపనీలో ఉద్యోగం చేసే వాళ్లు ఎంత లేదన్నా ఆఫీసులో ఒక 8 గంటలు పాటు పని చేయాలి కదా.అలా పని చేసే క్రమంలో ఆ ఉద్యోగి 8 గంటల్లో టాయ్ లెట్ కు కనీసం రెండు మూడు సార్లన్నా వెళ్లవలిసి వస్తుంది కదా.! అయితే చైనాలోని ఓ కంపెనీలో మాత్రం ఒక వింత రూల్ ఒకటి ఉంది తెలుసా.దాని గురించి మీరు వింటే నోరు వెళ్లబెడతారు.
అది ఏంటంటే.అక్కడ పని చేసే ఉద్యోగులు ‘‘రోజుకు ఒకే ఒక్కసారి’’ మాత్రమే టాయ్ లెట్ కు వెళ్లాలట.
అలాకాకుండా ఒకసారికి మించి ఎక్కువ సార్లు వెళితే “ఫైన్’’ వేస్తామంటోంది అక్కడ కంపనీ.మరి ఘోరం కదా.వినే మనకే ఇలా వింటే.పాపం ఇక ఆ ఉద్యోగుల పరిస్థితి తలచుకుంటేనే బాధేస్తుంది కదూ.అయితే, ఈ రూల్ పెట్టడానికి సదరు కంపెనీ ఏమంటోందో చుడండి.టాయిలెట్ లో కూర్చొని టైంపాస్ చేద్దామంటే కుదురదు.
చేసే పని ఏది అయినాగాని ఒక్కసారే కంప్లీట్ చేసుకుని రావాల్సిందే.లేదంటే మళ్లీ వెళదామనుకుంటే మాత్రం ఫైన్ తప్పదంటోంది.
అయితే ఈ రూల్ పనిచేయడానికి బద్దకించే ఉద్యోగుల కోసమే ఈ రూల్ పెట్టామని ఆ సంస్థ చెబుతుంది.
చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లో ఉన్న డోంగ్గువాన్ లో గల అన్పు ఎలక్ట్రిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సంస్థ ఉద్యోగులకు కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది.తమ సంస్థలోని ఉద్యోగులు రోజులో ఒకే ఒక్కసారి టాయ్ లెట్ కు వెళ్లాలని అంతకంటే ఎక్కువసార్లు టాయిలెట్ వాడితే 20 యువాన్ (3 యూస్ డాలర్లు, ఇండియా కరెన్సీ అయితే రూ.227) జరిమానా చెల్లించాలని నిబంధన పెట్టింది.ఈ నిబంధన ఇష్టం లేని కొంతమంది ఉద్యోగులు సంస్థ నోటీసును సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.
దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరగడంతో ఆ కంపెనీ సమాధానం ఇస్తూ.
‘‘కొంతమంది ఉద్యోగులు పని తప్పించుకోవటానికి టాయిలెట్ పేరుతో సమయం వృథా చేస్తున్నారని.స్మోకింగ్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారనీ తెలిపింది.ఎటువంటి వారి కోసమో ఈ రూల్ పెట్టాల్సి వచ్చింది’’ అని సంస్థ మేనేజర్ కావో ఓ టీవీ చానెల్‌కు తెలిపారు.దీంతో వారిలో మార్పు వస్తుందని తాము ఆశిస్తున్నామని తెలిపారు.
అలాగే ఈ రూల్ అతిక్రమించే ఉద్యోగి నుంచి నేరుగా జరిమానా తీసుకోబోమని.ఆ జరిమానాను వారికిచ్చే జీతం నుంచి కట్ చేస్తామని తెలిపారు.
మిగతా వాళ్ళ మాట ఎలా ఉన్నాగాని పాపం డయాబెటిస్ ప్రాబ్లం ఉన్నవారి గురించి అయిన ఆలోచిస్తే బాగుంటుంది కదా.