మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన క్రాక్ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది.నిన్న మొన్నటి వరకు ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 12 లేదా 13వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా చాలా క్లీయర్ గా అదుపులో ఉంది.కనుక ఆందోళన లేకుండా సంక్రాంతికి సినిమాలు విడుదల చేసుకోవచ్చు అంటూ మేకర్స్ భావిస్తున్నారు.
అందుకే సంక్రాంతి కానుకగా నాలుగు అయిదు సినిమాలు రాబోతున్నాయి.దాంతో క్రాక్ సినిమాకు పోటీ చాలా తీవ్రమైంది.
ఈ సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు అనూహ్యంగా ముందే సంక్రాంతికి సిద్దం అయ్యారు.సినిమాను ఈనెల 9వ తారీకునే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి అంటూ యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
సినిమాను సెన్సార్ పూర్తి అవ్వడంతో ఈనెల 9న విడుదల చేయడంకు అంతా మార్గం సుగమం అయ్యింది.
సంక్రాంతికి విజయ్ మాస్టర్ సినిమాతో పాటు ఇంకా చిన్నా చితకా సినిమాలు చాలా విడుదల ఉన్న ఈ సమయంలో క్రాక్ సినిమాను ముందు విడుదల చేయడం చాలా మంచి నిర్ణయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ హీరోగా గతంలో గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
కనుక క్రాక్ సినిమా ఖచ్చితం గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.శృతి హాసన్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటించిన విషయం తెల్సిందే.
పోలీస్ ఆఫీసర్ గా రవితేజ ఈ సినిమాలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ట్రైలర్ కు అద్బుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమా ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంటుందని అంటున్నారు.
.