సుఖ వ్యాధులు రాకుండా, అవాంచిత గర్భం రాకుండా ఉండేందుకు ప్రజలు ఎక్కువగా కండోమ్స్ ఉపయోగిస్తారు.గర్భనిరోధక మాత్రల కంటే కండోమ్స్ పైనే ప్రజలు ఎక్కువగా ఆధారపడుతుంటారు.అయితే ఈ కండోమ్స్ ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నాయి.ప్రస్తుతం కండోమ్స్ రకరకాల ఫ్లేవర్ లతో వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి.రబ్బర్ తో కండోమ్లను తయారుచేయడం 1885 లోనే కనిపెట్టారు.అంతకుముందు రబ్బర్ వినియోగం తెలియక జిడ్డుగా ఉండే జంతువు చర్మం, పేగులను వాడి కండోమ్స్ తయారు చేసేవారు.
రోమ్ సైనికులు తమ శత్రువుల చర్మంతో కండోమ్స్ తయారుచేసుకొని శృంగారంలో వాడేవారు.అంటే మనిషి చర్మంతో కండోమ్స్ తయారు చేసేవారు.వాటికి విక్టరీ కండోమ్స్ అని పేరు కూడా పెట్టారు.అయితే ఈ కండోమ్లు గర్భం రాకుండా నిరోధించగలిగేవి కానీ రోగాల నుంచి మాత్రం కాపాడలేవని ప్రముఖ డాక్టర్లు చెబుతున్నారు.
నిజానికి ఇప్పటికి కూడా జంతువుల నుంచి కండోమ్స్ లను తయారు చేస్తున్నారు.వీటిని లంబ్ స్కిన్ కండోములు అని పిలుస్తుంటారు.
కానీ వీటిని వాడటం వలన లైంగిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.అందుకే చాలా మంది రబ్బరు కండోమ్స్ లను మాత్రమే వినియోగిస్తారు.
1916 వ సంవత్సరంలో యంగ్ రబ్బర్ కార్పొరేషన్ అనే సంస్థ మొదటిసారిగా ట్రోజన్ పేరుతో రబ్బర్ కండోమ్ ని తయారుచేసింది.1937 లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ రబ్బర్ కండోమ్లను ఒక డ్రగ్ గా గుర్తించింది.ఇక అప్పటి నుంచి రబ్బర్ కండోముల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.సుఖవ్యాధులు పెరిగిపోతున్న నేపథ్యంలో కండోముల వాడటం కూడా విపరీతంగా పెరిగిపోయింది.అలాగే కండోమ్ ధరించడం వలన అసంతృప్తి తలెత్తుతుంది అన్న సమస్యలకు కూడా కొన్ని సంస్థలు పరిష్కారాలు చూపుతున్నాయి. థిన్, డాటెడ్ కండోమ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి.వీటిలో రకరకాల ఫ్లేవర్ లలో, ఆకృతులలో కండోమ్ లు వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి.2008వ సంవత్సరంలో పాలిప్రొపిలిన్ అనే పాలిమర్ రబ్బర్ తో తయారుచేసిన కండోమ్ లు కూడా మార్కెట్లోకి వచ్చాయి.