మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఈ సినిమాలో చిరుతో పాటు ఓ కేమియో పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించబోతున్నాడు.
అయితే ఇటీవల బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 ఫినాలేకు గెస్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చిరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో చాలా జాలీగా ముచ్చటించారు.
ఇందులో భాగంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన మెహబూబ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు.కాగా తన నెక్ట్స్ చిత్రంలో మెహబూబ్‌కు ఓ అవకాశం ఇవ్వాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఆచార్య చిత్రంలో ఓ చిన్న పాత్ర కోసం మెహబూబ్‌కు అవకాశం ఇవ్వాలని దర్శకుడు కొరటాల శివను చిరంజీవి కోరినట్లు తెలుస్తోంది.దీనికి కొరటాల కూడా వెంటనే ఓకే అనేశారని, త్వరలోనే మెహబూబ్‌కు ఈ సినిమాలో ఓ ఛాన్స్ దక్కడం ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ ఇది నిజమైతే మెహబూబ్‌కు అదృష్టం కలిసొచ్చినట్లే అంటున్నారు ప్రేక్షకులు.బిగ్‌బాస్ 4లో తనకంటూ మంచి ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్న మెహబూబ్, టాప్-5కి రాకముందే ఎలిమినేట్ అయ్యాడు.
అయితే సోహెల్‌తో ఉన్న మంచి స్నేహం కారణంగా మెహబూబ్ అంటే కూడా ప్రేక్షకుల్లో క్రేజ్ మరింత పెరిగింది.మరి ఆచార్య చిత్రంలో నిజంగానే మెహబూబ్ కనిపిస్తాడా అనేది చూడాల్సి ఉంది.
ఇక ఆచార్య చిత్రంలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.