గర్భవతి అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఫోటో వైరల్..!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 1లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది హరితేజ.పలు షోలకు యాంకర్ గా వ్యవహరించిన హరితేజ స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించి నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 Anchor Hariteja Become Pregnant Her Video Goes Viral, Hari Teja Husbend Deepak,-TeluguStop.com

పలు సీరియళ్లలో కూడా నటించి పాపులారిటీ సంపాదించుకున్న హరితేజ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.సోషల్ మీడియా ద్వారా హరితేజ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

బిగ్ బాస్ సీజన్ 1లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న హరితేజ టాప్ 5లో చోటు సంపాదించుకున్నారు.ఆ షో ద్వారా వచ్చిన గుర్తింపే హరితేజకు వరుసగా అవకాశాలు రావడానికి కారణమైంది.

బిగ్ బాస్ హౌస్ లో హరితేజ చెప్పిన హరికథలు ఆమెలోని ప్రతిభ ప్రేక్షకులకు తెలిసేలా చేశాయి.గత కొంతకాలం నుంచి టీవీ షోలకు దూరంగా ఉంటున్న హరితేజ షేర్ చేసిన వీడియోలో గర్భాన్ని చూసుకుంటూ ఆనందంతో డ్యాన్స్ చేశారు.

మాతృత్వం అనుభూతిని పొందుతూ హరితేజ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.హరితేజ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇంటికే పరిమితమైన హరితేజ వీడియోలో ఎంతో సంతోషంతో కనిపించారు.యాంకర్ గా నటిగా సుపరిచితం అయిన హరితేజ మంచి డ్యాన్సర్ కూడా కావడం గమనార్హం.

హరితేజ భర్త పేరు దీపక్ కాగా లాక్ డౌన్ సమయంలో హరితేజ భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేశారు.లాక్ డౌన్ టైమ్ లో వచ్చిన మ్యారేజ్ డే రోజున దీపక్ ను చూస్తుంటే ఒకరికోసం మరొకరు పుట్టామనే భావన కలుగుతోందని.

తన జీవితంలో దీపూ కంటే గొప్పగా ఎవరూ ఉండరని హరితేజ పోస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube