మొట్టమొదటిసారిగా కరోనా వైరస్ సంబంధించిన టీకాను అధికారికంగా ఆమోదించిన దేశంగా ఇంగ్లాండ్ నిలిచింది.ఫైజర్- బయో ఎన్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ టీకా ను తాజాగా అనుమతిస్తూ ఇంగ్లాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీంతో ఫైజర్ వ్యాక్సిన్ సంబంధించి అనుమతించిన దేశంగా బ్రిటన్ నిలిచింది.ఈ సందర్భంగా స్పందించిన సంస్థ తక్షణమే వారి వద్ద ఉన్న వ్యాక్సిన్ ను ఇంగ్లాండ్ కు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా తెలియజేశారు.
దీంతో వచ్చే వారం రోజుల్లో కరోనా వ్యాక్సిన్ సంబంధించి టీకాను ఇంగ్లాండ్ దేశంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫైజర్ సంస్థ చెప్పుకొచ్చింది.
ది ఇండిపెండెంట్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఇచ్చిన నిబంధనల మేరకు ఫైజర్ సంస్థ తయారు చేసిన కరోనా మెడిసిన్ వినియోగానికి ఇంగ్లండ్ ప్రభుత్వం తాజాగా ఆమోదాన్ని తెలియజేసింది.
దీంతో వచ్చే వారం నుండి కరోనా వ్యాక్సిన్ సంబంధించి మందు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ప్రజలకు తెలియ చేసింది.ఇందుకు సంబంధించి హెల్త్ సెక్రటరీ మాట్లాడుతూ.ఇది చాలా మంచి వార్త అని, వచ్చే వారం నుంచి వాక్సినేషన్ మొదలు కాబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
అలాగే ఫైజర్ సంస్థ యొక్క సీఈఓ మాట్లాడుతూ.ఇది చారిత్రాత్మక నిర్ణయం అని తాము ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన టీకాలను సరఫరా చేయడానికి సిద్ధం కాబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.తాము మొదటి నుంచి చెప్పుకున్నట్లుగానే విజ్ఞానశాస్త్రం గెలుస్తుందని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆమోదానికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ఇంగ్లాండ్ ప్రజలను రక్షించుకోవడంలో సహకరించడానికి సరైన సమయంలో చర్య తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగానే ఈ రెండు కోట్ల మంది టీకాలను ఇంగ్లాండ్ ప్రభుత్వానికి అందచేయనున్నట్లు సంస్థ తెలియజేసింది.
అయితే ఈ సంవత్సరం చివరి నాటికి ఎన్ని డోసులు అందుబాటులోకి వస్తాయన్న విషయాన్ని మాత్రం తెలియజేయలేదు.ఇందులో భాగంగానే ఫైజర్ సంస్థ విడుదల చేసే వ్యాక్సిన్ లను మూడు వారాల వ్యవధిలో రెండు టీకాలు వేయించుకుంటే పూర్తి రక్షణ కలుగుతుందని సమాచారం.