లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో కొన్ని అంశాలను ఎంచుకుని దానిపై లెక్చర్లు ఇవ్వడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.కంటెంట్ ఈజ్ కింగ్.
సౌత్ లేదు, నార్త్ లేదు .సినిమా రావాలి.నెక్స్ట్ సంవత్సరం నుంచి సినిమాలు రావాలి అంటున్నాడు క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్.ఇందులో భాగంగానే రైటర్స్ నిద్రపోతే ఇండస్ట్రీ నిద్రపోతుంది అని ఆయన గుర్తు చేశాడు.
తాను మొదలుపెట్టిన పూరి మ్యూజింగ్స్ లో భాగంగా లోకల్ ఈజ్ గ్లోబల్ అనే అంశంపై తాజాగా పూరి జగన్నాథ్ చర్చించాడు.
ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.
సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్ లు కావచ్చు ప్రస్తుతం ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో మనం చూడలేనంత మ్యాటర్ ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు.అయినా సరే చాలా మంది వారి స్నేహితులను ఏదైనా మంచి కథ ఉంటే రెకమెండ్ చేయమని కోరుతూ ఉంటారు అన్నట్లు ఆయన తెలిపాడు.
ఇందులో కొన్ని వెబ్ సిరీస్ లు సినిమాల కంటే బాగున్నాయ్ అని ఆయన చెప్పుకొచ్చారు.
మనం స్టాండెడ్ ఉన్న సినిమాలు తీస్తే, చూడటానికి ప్రపంచం రెడీగా ఉందని ఆయన తెలిపాడు.
భారత్ లో ఇప్పుడు చాలామంది చైనీస్, కొరియన్ భాషకు సంబంధించిన సినిమాలు చూస్తున్నారని.అందుకు సంబంధించి తగ్గట్టుగా కొత్త రైటర్స్ సినీ ఇండస్ట్రీకి రావాలని పూరి జగన్నాథ్ తెలిపాడు.
ఎవరైనా రైటర్ అయితే వారు నిద్రపోవద్దని నీ మీదే అందరూ డిపెండ్ అయి ఉంటారని, ప్రొడ్యూసర్స్ చేతుల్లో డబ్బులు పట్టుకొని ఎదురు చూస్తున్నట్లు, అలాగే కొన్ని కంపెనీలు కూడా వారి కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపాడు.మన దగ్గర కంటెంట్ ఉంటే చాలు అందరూ మన దగ్గరికి వస్తారు.
స్పీడ్ పెంచడం, స్టాండర్డ్స్ మార్చుకుందాం.లోకల్ సినిమాను ప్రపంచానికి చాటి చెపుదాం అంటూ లోకల్ ఈజ్ గ్లోబల్ గురించి పూరి జగన్నాథ్ తెలియజేశాడు.