చలితో కరోనా వస్తుందనేది పచ్చి అబద్దం.. అసలు నిజం ఏమిటంటే?

గత కొద్ది రోజుల నుంచి శీతాకాలం మొదలవడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలో మార్పులు చోటుచేసుకుంటాయి.

అయితే వాతావరణంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండటం వల్ల చలి తీవ్రతకు కరోనా వైరస్ వ్యాధి తీవ్రత అధికమవుతుందని, తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా మహమ్మారి నుంచి జాగ్రత్త పడవచ్చని ఇదివరకు నిపుణులు హెచ్చరించారు.

కానీ అది ఏమాత్రం నిజం కాదంటూ, తాజా పరిశోధనల్లో వెల్లడైంది.కరోనా వ్యాప్తి వాతావరణంలో మార్పుల వల్ల తీవ్రతరం కాదని, కేవలం మనుషులు చేసే తప్పిదాల వల్ల మాత్రమే వ్యాపిస్తుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవటం వల్ల వైరస్ వ్యాపించదని, కేవలం మనుషులు కనీస జాగ్రత్తలు పాటించకుండా, గుంపులుగుంపులుగా ఏర్పడటం, సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకుండా బయట సంచారం చేయడం ద్వారా కరోనా వైరస్ ఉద్ధృతం అవుతుందని యూటీ అస్టిన్ జాక్సన్ స్కూల్ ఆఫ్ జియో సైన్సెస్ అండ్ కోక్రెల్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ టీమ్ లీడర్ దేవ్ నియోగి తెలియజేశారు.ఈ పరిశోధనలో ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

కరోనా వైరస్ వ్యాధి వేసవి కాలంలో చాలా తక్కువ ప్రభావం చూపుతుందని, ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు భావించారు.ఈ మహమ్మారి కేవలం మనుషుల నిర్లక్ష్యం వల్లే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Advertisement

ఈ మహమ్మారి ఇంట్లో కంటే బయట వాతావరణంలో ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ బయట తిరిగేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి, శానిటైజర్ లు వాడటం,సామాజిక దూరం పాటించడంవల్ల ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.అంతేకానీ వాతావరణంలో మార్పుల వల్ల కరోనా వ్యాధి ఉదృతం కాదని తేల్చిచెప్పారు.

అదృష్టం అంటే ఇదే కాబోలు.. రెప్పపాటులో ప్రమాదం నుండి తప్పించుకున్న బైక్ రైడర్స్..
Advertisement

తాజా వార్తలు