చిన్నారితో పాటు ఆన్ లైన్ క్లాసులు వింటున్న కోతులు!

కరోనా వ్యాప్తి రోజురోజుకు అధికమవుతున్న నేపథ్యంలో గత కొద్ది నెలలుగా అన్ని విద్యా సంస్థలు కూడా ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసినదే.అయితే లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన నేపథ్యంలో మరి అకడమిక్ ఇయర్ ప్రారంభమైన తరుణంలో ఇప్పటికి కూడా విద్యాసంస్థలు తెరవడానికి ప్రభుత్వం ఎటువంటి పర్మిషన్ ఇవ్వకపోవడంతో.

 Monkeys Listening Online Classes With Monkeys, Join Online Class, Monkeys, Kid S-TeluguStop.com

అన్ని ప్రభుత్వ , ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులు నష్టపోకుండా ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు.

ఆన్ లైన్ తరగతులు విద్యార్థులకు నిర్వహించడం మనకు తెలిసిన విషయమే.

కానీ ఆన్లైన్ తరగతులను కోతులు కూడా వినడం మీరు ఎప్పుడైనా చూశారా? కోతుల ఒకచోట నుంచి మరొక చోటకు ఎగురుతూ ఎంతో అల్లరి సృష్టిస్తుంటాయి.మరి అలాంటి కోతులు ఒక చోట చేరి కుదురుగా కూర్చుని ఆన్ లైన్ క్లాసులు వినడం ఎప్పుడైనా చూశారా? ఇలాంటి అద్భుతమైన ఘటనకు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆన్లైన్ తరగతులను ఎంతో శ్రద్దగా వింటున్నా ఓ చిన్నారిని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా, కిటికీ ఊచలు పట్టుకొని కోతులు కూడా ఎంతో శ్రద్ధగా ఆన్ లైన్ తరగతులను వింటున్న ఈ సన్నివేశాన్ని ఆ తల్లిదండ్రులు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే ఈ ఫోటో ని చూస్తే మాత్రం అక్కడ కోతులు ఉన్నాయా, లేక ఏదైనా కోతుల ఫోటో పెట్టారా అన్న అనుమానం కలుగుతుంది.

, అంత సైలెంట్ గా కోతుల అక్కడ కూర్చుని ఆన్లైన్ తరగతులను వినడం అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.ఎప్పుడూ అల్లరి పనులను చేస్తూ కనిపించే కోతులు ఒక్కసారిగా ఇలా ఒక చోట సైలెంట్ గా కూర్చొని ఉన్న ఫోటో నెట్టింట్లో అందరిని ఆకర్షించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube