టెర్రరిస్ట్ పాత్రలో నటిస్తున్న సమంత మరి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా...?

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారం అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో హిందీలో ప్రసారమయ్యే  “ది ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్ ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రేక్షకులకు తెలిసిందే.అయితే ఈ వెబ్ సిరీస్ కి బాలీవుడ్ దర్శకులు రాజ్ మరియు డీకే దర్శకత్వం వహిస్తుండగా మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి,  సమంత అక్కినేని, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

 Is Samantha Akkineni Playing Terrorist's Role In The Family Men Second Season S-TeluguStop.com

అయితే ది ఫ్యామిలీ మెన్ రెండో సీజన్లో సమంత అక్కినేని కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అంతేగాక ఇందులో సమంత అక్కినేని పాకిస్తాన్ దేశానికి చెందిన టెర్రరిస్ట్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరిస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వైరల్ అవుతున్నాయి.

అయితే గతంలో సమంత అక్కినేని తమిళ ప్రముఖ హీరో విక్రమ్ హీరోగా నటించిన టెన్ అనే చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో కనిపించింది.  కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో సమంత అక్కినేని నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటిస్తే ఆమె అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో పెద్ద చర్చ జరుగుతోంది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తమిళంలో సమంత అక్కినేని తమిళ్ తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

 అలాగే తెలుగులో ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube