హాలీవుడ్ సంబంధించి నటీనటులు అవార్డుల ఫంక్షన్లో వివిధ రకాల డ్రెస్సులు వేసుకొని తళుక్కుమంటున్నారు.కేవలం అవార్డు ఫంక్షన్ లో మాత్రమే కాకుండా ఏదైనా కార్యక్రమాలలో కూడా అందరికంటే భిన్నంగా కనిపించాలని వివిధ రకాల డిజైన్డ్ డ్రెస్ లను వేసుకొని వారి అభిమానులను ఆనందపరుస్తూ ఉంటారు.
మీడియా దృష్టి అంతా వారు తీసుకువచ్చే బట్టలపై అదేపనిగా ఫోకస్ చేస్తూ ఉంటాయి.ఇదే క్రమంలోనే నటీనటులు పబ్లిసిటీ, పాపులారిటీ కోసం అనేక వింత వింత డ్రెస్సులు వేసుకొని వచ్చి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారు.
అయితే ఇది వరకు హాలీవుడ్ లో ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా ధరించిన ఆ డ్రెస్ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.దీనికి గల కారణం ఆవిడ బీఫ్ తో తయారు చేసిన ఓ డ్రెస్సును ధరించడమే.
అయితే ఆ డ్రస్ నిజంగా మాంసంతో తయారు చేసిందా లేకపోతే ఏదైనా కృత్రిమంగా తయారుచేసిందా అన్న విషయంపై అప్పట్లో అనేక సందేహాలు బయటికి వచ్చాయి.కాకపోతే ఇప్పుడు అందుకు సంబంధించి ఓ స్పష్టత బయటికి వచ్చింది.
సింగర్ లేడి గాగా ఓ అవార్డు ఫంక్షన్ లో 8 అవార్డులను సొంతం చేసుకుంది.అయితే, ఆ వేడుకకు ఆవిడ ఓ బీఫ్ డ్రెస్ వేసుకొచ్చింది.
అయితే అప్పట్లో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.అంతేకాకుండా కొంతమంది జంతు హక్కుల సంఘ కార్యకర్తలు, అలాగే సామాజిక కార్యకర్తలు ఆమెపై పెద్ద ఎత్తున మండిపడ్డారు.
అయితే ఆ డ్రెస్ నిజంగానే మాంసంతో తయారు చేసిందా లేకపోతే డిజైన్ తో చేసిందా అనే విషయం తాజాగా వెల్లడైంది.ఆమె ధరించిన డ్రెస్ ను నిజంగానే బీఫ్ తో తయారు చేశారని నిర్ధారణ జరిగింది.
అయితే తాజాగా ఈ డ్రెస్ లో ఒక చోట ఉంచి దాన్ని ఓ ఎగ్జిబిషన్ లో పెట్టినట్టు సమాచారం.అయితే కొందరు డిజైనర్లు మాత్రం అచ్చం అలాంటి స్టైల్ లోనే కృత్రిమంగా డ్రెస్ రూపొందించి వాటికి లేడీ గాగా డ్రెస్సెస్ అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.
దానిని మార్కెట్లో ఏకంగా ఒక లక్ష డాలర్లకు అంటే మన కరెన్సీలో 73 లక్షల పైగా విక్రయిస్తున్నారు.ఇంత ధర పెట్టి డ్రెస్ ఎవరు కొంటారు అని అనుకుంటున్నారా…? అలాంటిదేమీ లేదండి… ఇలా ఈ డ్రెస్సులను కొనడానికి అనేక మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారట.ఇకపోతే లేడీ గాగా ధరించిన డ్రెస్ మాంసంతో చేసినది నిర్ధారణ కావడంతో ఇప్పుడు జంతు హక్కుల కార్యకర్తలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.