మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టుకుంది.దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాతో రవితేజ ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కసిగా ఉన్నాడు.
అయితే చివరిదశ షూటింగ్‌ను వాయిదా వేసుకున్న క్రాక్ చిత్రం, తాజాగా తిరిగి షూటింగ్‌ను ప్రారంభించుకుంది.
ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా కథ పూర్తిగా యాక్షన్ జోనర్‌కు చెందినట్లు చిత్ర పోస్టర్స్, టీజర్లు చూస్తే తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.కాగా ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్‌గా చేసే యాక్షన్ స్టంట్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ మధ్యకాలంలో రవితేజ నుండి సరైన మాస్ మసాలా చిత్రం రాలేదని, క్రాక్ చిత్రం ఆ లోటును భర్తీ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమాలో తమిళ నటుడు సముథ్రికరన్, వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి నటులు కూడా ఉండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.కాగా ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
అయితే ఎంత త్వరగా షూటింగ్ పూర్తి చేసినా, సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ కావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.