ఈ ఫోటోలో ఎన్టీఆర్ తో పాటు ఉన్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన  “స్టూడెంట్ నెం 1” అనే చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా హీరోయిన్ గజాల హీరోయిన్ గా నటించింది.

 Student Number 1 Movie Successfully Completes 19 Years Student Number 1, jr Nt-TeluguStop.com

కాగా తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, అలీ, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ చిత్రం విడుదలై ఇటీవలే 19 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ చిత్రానికి సంబంధించి నటువంటి కొన్ని మధుర జ్ఞాపకాలను చిత్ర యూనిట్ సభ్యులు నెటిజన్లతో పంచుకున్నారు.

అయితే ఇందులో భాగంగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కి సన్నివేశాన్ని వివరిస్తున్న సమయంలో తీసినటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేశారు.దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ఈ చిత్రం విడుదలై 19 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆ చరిష్మా తగ్గలేదని అంతగా దర్శకుడు రాజమౌళి తన పనితీరుతో ఆకట్టుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాక రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ అని ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. 

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న  ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రం మల్టీస్టారర్ కావడంతో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు.

 ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube