ఈ ఫోటోలో ఎన్టీఆర్ తో పాటు ఉన్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన  "స్టూడెంట్ నెం 1" అనే చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.

అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా హీరోయిన్ గజాల హీరోయిన్ గా నటించింది.

కాగా తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, అలీ, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే ఈ చిత్రం విడుదలై ఇటీవలే 19 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ చిత్రానికి సంబంధించి నటువంటి కొన్ని మధుర జ్ఞాపకాలను చిత్ర యూనిట్ సభ్యులు నెటిజన్లతో పంచుకున్నారు.

అయితే ఇందులో భాగంగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కి సన్నివేశాన్ని వివరిస్తున్న సమయంలో తీసినటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేశారు.

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ఈ చిత్రం విడుదలై 19 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆ చరిష్మా తగ్గలేదని అంతగా దర్శకుడు రాజమౌళి తన పనితీరుతో ఆకట్టుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాక రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ అని ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

  అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న  ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రం మల్టీస్టారర్ కావడంతో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.

అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు.

 ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

థమన్ ఆవేదన గురించి రియాక్ట్ అయిన చిరంజీవి.. అలా కామెంట్లు చేశారా?