మొదట్లో సినీ పరిశ్రమకి హీరోయిన్ అవుదామని వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు పరిమితమైన నటీనటుల్లో తెలుగు బ్యూటీపూజా రామచంద్రన్ ఒకరు. అయితే ఈ అమ్మడికి హీరోయిన్ అయ్యే లక్షణాలు మెండుగా ఉన్నప్పటికీ ఎందుకో హీరోయిన్ గా సినీ అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది.దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సరి పెట్టుకుంటోంది.అప్పుడప్పుడు కొంత మేర బోల్డ్ తరహా పాత్రలో కూడా నటించి అలరిస్తోంది. అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పూజా రామచంద్రన్ పాల్గొంది.
అయితే ఇందులో భాగంగా తన మొదటి భర్తతో విడిపోవడానికి గల కారణాలను ప్రేక్షకులకు తెలిపింది.
అయితే తన మొదటి భర్త ను ప్రముఖ మ్యూజిక్ సంస్థలో పని చేసేవాడని ఆ ఆ సమయంలోనే అతడిని చూసి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నానని కానీ ఒకానొక సమయంలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో ఇరువురి అంగీకారంతో విడాకులు తీసుకున్నామని చెప్పుకొచ్చింది.ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాలలో విలన్ పాత్రలో నటించిన ప్రముఖ విలన్ జాన్ కొక్కెన్ ని పెళ్లి చేసుకున్నానని తెలిపింది.
మొదటగా ఇరువురు క్షుణ్ణంగా ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నామని దాంతో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామంటూ తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా పూజా రామచంద్రన్ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగులు లేకపోవడంతో భర్తతో కలిసి సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తోంది.
ఈ క్రమంలో ఇంటి పట్టునే ఉంటూ ఆరోగ్యానికి సంబంధించిన యోగా, వ్యాయాయం ఫిట్నెస్ వంటివి చేస్తూ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తోంది. కాగా ఆ మధ్య ప్రముఖ దర్శకుడు సతీష్ విగ్నేష్ దర్శకత్వం వహించిన “ఎంత మంచి వాడవురా.!” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోకపోవడంతో ఈ అమ్మడికి గుర్తింపు రాలేదు.