ఆ విషయంలో బాగా బాధపడ్డాను కానీ...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ టీవీలో అప్పట్లో ప్రసారమయ్యే  “ఆహ్వానం”  అనే  సీరియల్ ద్వారా తెలుగు సినీ బుల్లితెరకు నటిగా పరిచయమైన నవ్య స్వామి గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆహ్వానం సీరియల్ అప్పట్లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడిని ఎవరు గుర్తించలేదు.

 Telugu Serial Actress Navya Swamy React About Corona Virus Positive Rumors Navy-TeluguStop.com

కానీ ఆ తరువాత నవ్య స్వామి నటించిన “నా పేరు మీనాక్షి” అనే సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడికి వరుస సీరియల్ లో నటించే అవకాశాలు క్యూ కట్టాయి.

అయితే తాజాగా నవ్య స్వామి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తెలుగు బుల్లితెర మీద తన ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

కాగా ఇందులో తాను తెలుగు సినీ పరిశ్రమకి వచ్చి దాదాపుగా 7 సంవత్సరాలు అవుతుందని అంతకు ముందు కన్నడలో పలు సీరియల్స్ లో నటించానని కానీ అవేమీ తనకు గుర్తింపు తెచ్చి పెట్టలేదని పేర్కొంది.

అంతేగాక తాను ఒకప్పుడు ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ తన తండ్రి వ్యాపారాల్లో నష్టాల కారణంగా కొంతమేర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నామని ఈ క్రమంలో తన కాలేజీ ఫీజు కూడా తానే ఉద్యోగం చేస్తూ సంపాదించుకున్నానని ఎమోషనల్ అయ్యింది. ఆ తరువాత తెలిసిన వారి ద్వారా టీవీ సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చిందని దాంతో ప్రస్తుతం బాగానే రాణిస్తున్నానని తెలిపింది.

అయితే ఇటీవలే తనకు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో కొంతమేర మానసికంగా కృంగి పోయానని కానీ తర్వాత తన కుటుంబ సభ్యుల అండదండలతో తొందరగానే కోలుకున్నానని తెలిపింది. అయితే తాను కరోనా బారిన పడ్డ సమయంలో తనపై వచ్చినటువంటి రూమర్లు విని కొంతమేర బాధ పడినప్పటికీ అందులో ఎలాంటి వాస్తవాలు లేవని లైట్ తీసుకున్నానని చెప్పుకొచ్చింది.

అయితే ప్రస్తుతం 3 సీరియల్స్ లో నటిస్తున్నానని ఒకవేళ సినిమా ఆఫర్లు వచ్చినా కూడా సీరియల్స్ లో మాత్రం నటించడం మానని చెప్పుకొచ్చింది.అలాగే ఈ మధ్య కాలంలో తాను ఓ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్నట్లు పలు రూమర్ల వినిపిస్తున్నాయని అయితే ఎప్పటి నుంచో తనకు కూడా ప్రొడక్షన్ హౌస్ నిర్మించాలని ఉందని కానీ ఇప్పుడు అప్పుడే ప్లాన్ చేయడం లేదని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube