ఈ రెండు ప‌దార్థాల‌తో హెయిర్ ఫాల్‌, డాండ్రఫ్‌ల‌కు చెక్ పెట్టొచ్చు!

హెయిర్ ఫాల్, డాండ్రఫ్.స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో సర్వసాధారణంగా వేధించే జుట్టు సమస్యలు ఇవి.వీటిని నివారించుకోవడం కోసం ఖరీదైన షాంపూలు, నూనెలను కొనుగోలు చేసి వాడుతుంటారు.కొందరు వీటి నుంచి బయటపడటం కోసం మందులు వాడతారు, ఏవేవో ట్రీట్మెంట్స్‌ చేయించుకుంటారు.

 Hair Fall And Dandruff Can Be Prevented With These Two Substances! Hair Fall, Da-TeluguStop.com

కానీ ఇంట్లోనే చాలా సులభంగా రెండంటే రెండు పదార్థాలతో హెయిర్ ఫాల్, చుండ్రు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.మరి ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటి.? వాటిని ఎలా కేశాలకు ఉపయోగించాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హిట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్ వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన పదార్థాలను చల్లార బెట్టుకోవాలి.కంప్లీట్ గా కూల్ అయిన అనంతరం మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.

గంట లేదా రెండు గంటల పాటు షవర్ క్యాప్ ధరించి ఆపై మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే అవిసె గింజలు, ములేటి పౌడర్ లో ఉండే ప్రత్యేక సుగుణాలు హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేస్తాయి.చుండ్రు సమస్యను నివారిస్తాయి.

జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా పెరిగేందుకు సహకరిస్తాయి.మరియు అవిసె గింజలు, ములేటి పౌడ‌ర్‌తో పైన చెప్పిన విధంగా చేస్తే కురులు పట్టులా సైతం మెరుస్తాయి.

ఎవ‌రైతే హెయిర్ ఫాల్‌, డాండ్రఫ్ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారో.వారు ఖ‌చ్చితంగా ఈ రెమెడీని ప్ర‌య‌త్నించండి.

Home Remedies to Get Rid of Hair fall and Dandruff

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube