ఆర్ఆర్ఆర్‌కు 9 లింకు.. నోరెళ్లబెట్టాల్సిందే!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించే చిత్రాలు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో మనం ఇప్పటికే చూశాం.బాహుబలి సిరీస్ చిత్రంతో జక్కన్న అంతర్జాతీయంగా తన మార్క్‌ను వేసుకున్నాడు.

 Rrr Team Following 9 Sentiment, Rrr, Ntr, Ram Charan, Rajamouli, Tollywood News-TeluguStop.com

ఒక్కో సినిమా కోసం రాజమౌళి పడే కష్టం మనకు ఆయన సినిమాలను వెండితెరపై చూస్తే ఇట్టే అర్థమవుతుంది.కాగా ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆయన తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.ఈ సినిమాలో ఇద్దరు టాప్ తెలుగు హీరోలు నటిస్తుండటంతో యావత్ దేశ ప్రజలు ఈ సినిమా ఎలాంటి విధ్వంసాన్ని క్రియేట్ చేస్తుందా అని ఆతృతగా ఉన్నారు.

కాగా ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా జక్కన్న తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళి ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్‌ను అక్టోబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ తేదీని(22+10+2020=9) మొత్తం కలిపితే 9.అలాగే రామరాజు పాత్రకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసిన తేదీని(27+05+2020=9) కలిపితే కూడా తొమ్మిదే.ఇక ఈ సినిమా టైటిల్ RRRను తీసుకుంటే, ఇంగ్లీష్‌లో R లెటర్ సంఖ్య 18.దీంతో RRR=18+18+18=9 వస్తుంది.

కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి రిలీజ్ చేసిన వీడియోలోని బైక్‌కు ఉన్న నెంబర్ 1+9+7+1 = 9 రాగా, కారు నెంబర్ 6+1+7 = 9గా ఉన్నాయి.

ఇలా ఏ అంశం తీసుకున్నా ఆర్ఆర్ఆర్ చిత్రం 9 అనే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.మరి ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతారా అనేది చూడాల్సి ఉంది.

ఇక ఈ సినిమాతో మరోసారి రాజమౌళి ఎలాంటి రికార్డులకు తెరలేపుతాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube