జాతీయ పార్టీ బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీ హవా మరింత పెరుగుతుందా ? ఆయన వ్యూహానికి తిరుగులేదని మరోసారి నిరూపితం అవుతుందా ? అంటే.తాజాగా జరిగిన.
జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఔననే అంటున్నారు పరిశీలకులు. ఆర్ ఎస్ ఎస్ పునాదుల నుంచి వచ్చిన బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి.
వీటిలో కీలకమైంది..
హిందుత్వం. అదే సమయంలో గతంలో నెహ్రూ తీసుకున్న నిర్ణయాల కారణంగా నష్టపోయామని భావిస్తున్న ఆర్టికల్ 370 రద్దు సహా తలాక్ వంటి వాటిని రద్దు చేయడం కీలకంగా భావించారు.
ఇక, దేశంలోను అనేక మార్పుల దిశగా ముందుకు తీసుకువెళ్లాలనేది బీజేపీ వ్యూహాల్లో ఒకటి.
ఈ క్రమంలో జాతీయ స్తాయిలో రెండోసారి అధికారంలోకి వచ్చాక.
మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు బీజేపీ సిద్ధాంతాలను పూర్తిగా నెరవేరుస్తున్నాయనే అంటున్నారు పరిశీలకులు.ఏదైనా విషయాన్ని సాధించడంలో తెగువ ఎంత ముఖ్యమో.
వ్యూహం కూడా అంతే ముఖ్యం.ఇదే మోడీకి అందివచ్చిన వరాలుగా చెబుతున్నారు.
ఆయన వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను బలోపేతం చేస్తున్నాయి.తన ప్రమేయం లేదన్నట్టుగా ఆయన వుంటారు.
కానీ, జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి.ఈ పరిణామంతో బీజేపీలో రెండో నాయకుడు అంటూ.
లేకుండా పోయాడని అంటున్నారు.
వాస్తవానికి ఇప్పుడు బాబ్రీ మసీదు ఘటనపై తీర్పు వచ్చింది.
దీనిని ముందుగానే తాము ఊహించామని ఆడ్వాణీ వంటివారు.ప్రకటించడం గమనార్హం.
అంతేకాదు, ఉన్న 32 మంది కీలక నిందితులు కూడా నిర్దోషులేనని కోర్టు స్పష్టం చేసింది.ఈ పరిణామం వెనుక ఏం జరిగిందనేది ఆసక్తికర అంశమే అయినా.
అటు కాంగ్రెస్ కానీ, ఇటు.ఇతర మోడీ వ్యతిరేక కూటములు కానీ.పెదవి విప్పకపోవడం గమనార్హం.దీనిని మోడీ సాధించిన విజయంగానే భావించాలని అంటున్నారు పరిశీలకులు.
త్వరలోనే బీహార్ ఎన్నికలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఇవి ప్రభావం చూపుతాయని కూడా చెబుతున్నారు ఇవన్నీ ఇలా.ఉంటే.బీజేపీలో మోడీ రాబోయే రెండు దశాబ్దాల వరకు హీరోగానే ఉంటారనేది మరికొందరి విశ్లేషణ.
, ఏదేమైనా.ఇప్పుడు ఆయనను ప్రశ్నించే వారు కూడా లేకపోవడం గమనార్హం
.