తెలుగులో ప్రముఖ దర్శకుడు రవి కినాగి దర్శకత్వం వహించిన “ఆవారా” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ్ హీరో కార్తీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే కార్తీ అంతకు ముందే మల్లిగాడు, యుగానికి ఒక్కడు, తదితర చిత్రాలలో హీరోగా నటించినప్పటికీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఎవరు గుర్తించలేదు.
అయితే ఈ మధ్య హీరో కార్తీ వరుస సినిమాలలో హీరోగా నటిస్తూ బాగానే రాణిస్తున్నాడు. కాగా తాజాగా ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో హీరో కార్తీ పాల్గొన్నాడు.
ఇందులో భాగంగా తన ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే ఇందులో తాను టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా తో కలిసి జంటగా నటించిన “ఆవారా” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిందని అయితే ఆ చిత్రంలో తనకు తమన్నా కి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని దాంతో కొందరు ఏకంగా తమ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని కథలు అల్లేశారని అందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు.
అయితే మొదట్లో తనకు ఇలాంటి రూమర్స్ కొత్త కావడం వల్ల కొంతమేర బాధ పడినప్పటికీ నెమ్మదిగా సినిమా పరిశ్రమకు అలవాటు పడడంతో ఇవన్నీ కామన్ అని తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు.
అయితే చిన్నప్పుడు తన అన్నయ్య సూర్యతో తెగ గొడవ పడేవాడినని కానీ తాను సినిమా పరిశ్రమకి హీరో కావాలని వచ్చినప్పుడు మాత్రం తన అన్నయ్య సూర్యనే తన రోల్ మోడల్ అని తెలిపాడు.
అంతేగాక ఒకానొక సమయంలో సినిమాల కోసం తన అన్నయ్య సూర్య పడేటువంటి కష్టాన్ని చూసి అతడికి ఫ్యాన్ అయ్యానని తెలిపాడు. ఇప్పటికీ తామిద్దరూ అన్నదమ్ములు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నామని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కార్తీ తమిళంలో సుల్తాన్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా ప్రారంభమైనట్లు సమాచారం.