దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తోంది.ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 41 లక్షలకు దాటాయి.
రాష్ట్రాల్లో వేలల్లో కరోనా కేసులు వేలల్లో నమోదు కావడంతో దేశం పరిస్థితి దినదిన గండంగా మారుతోంది.దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఒకరి నుంచి మరొకరికి వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ ను కట్టడి చేయలేకపోతున్నారు.
లాక్ డౌన్ లోనే వేలల్లో నమోదైన కేసులు అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుండటంతో కేసులు ఏ స్థాయిలో పెరుగుతాయోనని ఆలోచిస్తూనే భయంగా ఉందంటున్నారు.దేశంలో కొన్ని వ్యాక్సిన్ లు క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నాయని చెప్పిన ప్రభుత్వం త్వరగా టీకాలను ఉత్పత్తి చేయాలని వారు కోరుతున్నారు.
భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో దేశంలో 90,633 కరోనా కేసులు నమోదవడంతో ఆ సంఖ్య 41,13,812కి చేరింది.దీంతో భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది.
నిన్న ఒక్క రోజే 1,065 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో మరణాల సంఖ్య 70,626కి చేరింది.
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 31,80,866కి చేరింది.ప్రస్తుతం దేశంలో 8,62,320 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.