పురుషుల కంటే మహిళల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ.. అందుకే !

పురుషుల్లో కంటే మహిళల్లో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.ప్రమాదకారక కణాలను నాశనం చేసే టి-కణాలు మహిళల్లో అధికంగా విడుదల అవుతుందని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యాయనం చేసి తెలియజేశారు.

 Women, Man, Immunity-TeluguStop.com

కరోనా మహమ్మారి బారిన పడినవారిలో అధిక సంఖ్యలో పురుషులు అస్వస్థతకు గురికావడంతో శాస్త్రవేత్తలు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు.ఈ మేరకు పరిశోధనలు నిర్వహించి అసలు కారణాన్ని కనుగొన్నారు.

అమెరికాలోని యేల్ యూనివర్సిటీ పరిశోధక శాస్త్రవేత్తలు ఓ పరిశోధన నిర్వహించారు.మహిళల కంటే పురుషులు ఎక్కువగా కరోనా బారినపడుతున్నారని, దానికి గల కారణాలేంటని తెలుసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగించారు.

ఈ మేరకు 18 ఏళ్లు పైబడిన 98 మంది కరోనా బాధితులపై అధ్యాయనం చేశారు.అయితే మానవ శరీరంలో కరోనా ప్రవేశించిన తర్వాత ప్రమాదకర కణాలను తయారవుతాయని, వాటిని నిర్మూలించడానికి రోగ నిరోధక వ్యవస్థలో టీ-కణాలు కీలకపాత్ర పోషిస్తాయని వాళ్లు గుర్తించారు.

పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ కణాలు అధికంగా విడుదల అవుతాయని, అందుకే మహిళలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.కరోనా బారిన పురుషులు అధికంగా ముప్పు ఉందని గుర్తించారు.

కరోనా బారి నుండి పురుషులు జాగ్రత్తగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని పరిశోధక శాస్త్రవేత్తలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube