రష్మికతో మరోసారి జత కడుతున్న రౌడీ స్టార్... ఈ సారి నో రొమాన్స్

విజయ్ దేవరకొండ కెరియర్ లో అర్జున్ రెడ్డి సినిమా ఎంతగా గుర్తుండిపోతుందో, గీతాగోవిందం సినిమా కూడా అంతే స్థాయిలో గుర్తుండిపోయే సినిమా.అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ పెర్ఫార్మెన్స్ తర్వాత దానికి పూర్తి విరుద్ధమైన పాత్రలో గీతాగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ కనిపిస్తాడు.

 Rashmika Once Again Act With Vijay Devarakonda, Tollywood, Telugu Cinema, Rashmi-TeluguStop.com

అయినా కూడా గోవిందం పాత్రలో తన కన్ఫ్యూజన్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు.సినిమా చూస్తున్నంత సేపు గోవిందం పాత్ర అందరిని అలరిస్తూనే ఉంటుంది.

టాలీవుడ్ లో కిస్సింగ్ స్టార్ గా పేరుపడ్డ విజయ్ దేవరకొండ ఈ సినిమాలో అలాంటి అతి రొమాన్స్ చేయకుండా ఆద్యంతం వినోదం అందించాడు.ఇక ఇందులో విజయ్ కి జోడీగా రష్మిక మందన నటించింది.

వీరిద్దరి ఆన్ స్క్రీన్ జంట అందరికి భాగా నచ్చింది.ఇద్దరు పెర్ఫెక్ట్ పెయిర్ అనిపించేలా కనిపించారు.

పెర్ఫార్మెన్స్ లో ఇద్దరు పోటీపడి నటించారు.

గీతాగోవిందం తర్వాత వీరిద్దరు డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశారు.

అందులో కూడా వీరి జంట అందరికి భాగా నచ్చింది.బయట కూడా వీరి మధ్య ఏదో కథ నడుస్తుందనే ప్రచారం మొదలైంది.

అయితే ఈ ప్రచారానికి వారిద్దరు ఫుల్ స్టాప్ పెట్టారు ఇదిలా ఉంటే ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా నటిస్తుంది.అలాగే నానితో మరోసారి జతకడుతుంది.

ఇక విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే పాన్ ఇండియా సినిమాలో చేస్తున్నాడు.అయితే రష్మిక, విజయ్ కలిసి మరోసారి జంటగా కనిపించబోతున్నారని తెలుస్తుంది.

కాని సినిమా కోసం కాదు ఓ బ్రాండ్ కోసం.ఓ షాపింగ్ మాల్ యాడ్ లో విజయ్, రష్మిక కలిసి నటించబోతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube