ప్రస్తుత రోజుల్లో ఇంట్లోనే కూర్చుని ఏ అవసరమైన వస్తువులను ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునే రోజులివి.గుండు పిన్ను నుండి టీవీ, ఫ్రిజ్, ఏసి ఇలా అనేక రకాల వాటిని ఆన్లైన్ లోనే ఆర్డర్ చేస్తే.
ఇట్టే ఇంటి గుమ్మానికి చేరిపోతాయి.అయితే భారతదేశంలో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి ఈ సామాజిక మార్గాలని ఉపయోగించుకుంటున్నాయి మొబైల్ సంస్థలు.
కొత్తగా ఏదైనా మొబైల్ ఫోన్ మార్కెట్లో విడుదల అయితే ముందుగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్స్ ద్వారా ఎక్కువ వినియోగదారులు కొనుగోలు చేస్తుంటారు.
అయితే చాలా సంవత్సరాల నుండి మొబైల్ ఫోన్ అమ్మకాల విషయంలో మాత్రం అమెజాన్ సంస్థను ఫ్లిప్ కార్ట్ సంస్థ బీట్ చేస్తూ వస్తోంది.
అయితే తాజాగా ఏప్రిల్ – జూన్ 2020 నెలల మధ్య ఫ్లిప్ కార్ట్ కంటే అమెజాన్ ఇండియా మొట్టమొదటిసారిగా మొబైల్ అమ్మకాల్లో మొదటి స్థానాన్ని పొందింది.ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో అమెజాన్ వాటా 47 శాతంగా ఉండగా, ఆ తర్వాత ఫ్లిప్ కార్ట్ కేవలం 42 శాతంతో రెండో స్థానంలో ఉంది.
ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా మొబైల్ స్టోర్ కి వెళ్లి కొనడం కంటే ఆన్లైన్ లోనే మొబైల్ ఫోన్ ఆర్డర్ చేస్తున్నారు ప్రజలు.ఇందులో మరీ ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం కారణంగా ఉద్యోగులకు కొన్ని అంశాల నేపథ్యంలో మొబైల్ ఫోన్ల వినియోగం ఎక్కువ కావడంతో కొన్నిరకాల స్మార్ట్ ఫోన్ లను వినియోగదారులు అత్యధిక మొత్తంలో కొనుగోలు చేశారు.
అయితే ఇందుకు తగ్గట్టుగానే వివిధ సంస్థలు సప్లై కూడా చేశాయి.