ఇండియాలో టిక్ టాక్ ని నిషేధించిన తర్వాత అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఇందుకు సంబంధించి ప్రత్యాన్మాయనకి ఇప్పటికే ఫేస్బుక్ సంస్థ ఇంస్టాగ్రామ్ రీల్స్ పేరుతో ఇంస్టాగ్రామ్ లో షార్ట్ వీడియోలు చేసుకొనే సదుపాయాన్ని కల్పించిన విషయం అందరికి తెలిసిందే.
నిజానికి ఇంస్టాగ్రామ్ తో పోలిస్తే ఫేస్ బుక్ యూజర్ బేస్ చాలా ఎక్కువ.కాబట్టి భారత్ లో ఫేస్ బుక్ వినియోగించే వారు ఎక్కువగా ఉన్న విషయం దృష్టిలో ఉంచుకొని ఫేస్ బుక్ సంస్థ ఇందుకోసం ఎలాంటి ప్రత్యేకమైన అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకోవలసిన అవసరమే లేకుండా ఫేస్ బుక్ యూజర్లు నేరుగా అదే యాప్‌లో షార్ట్ వీడియోలను తయారు చేసుకునే అవకాశాన్ని ఇవ్వబోతుంది.
ఇక ఇందు కోసం న్యూస్ ఫీడ్ లో ప్రత్యేకంగా షార్ట్ వీడియోస్ అనే సదుపాయాన్ని ఆ సంస్థ కొందరి వినియోగదారులకి అందించడం ఇవ్వబోతుంది.ఇక వీడియో క్రియతే అనే అప్షన్ ను కూడా కల్పించింది.
ఈ షార్ట్ వీడియోస్ విభాగంలో ఒక వీడియో చూసేటప్పుడు వేలిని పైకి స్వైప్ చేస్తే సరి, తర్వాతి వీడియో ప్లే అయ్యి విధంగా ఏర్పాటు చేసింది పేస్ బుక్.ఇక ఈ షార్ట్ వీడియోలను రికార్డ్ చేసే టైం లో మ్యూజిక్ జత చేయడమే కాకుండా, మధ్యలో వీడియో రికార్డింగ్ పాజ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.
ఇకపోతే ఇలా ఫేస్ బుక్ ద్వారా ఎంత టైమ్ లిమిట్ ను అనేది స్పష్టం కావలసి ఉంది.అయితే ఇది కేవలం అతి కొద్దిమంది భాారతీయ వినియోగదారుల మీదనే టెస్టింగ్ కోసం ఈ సదుపాయం విడుదల చేయబడింది.
టిక్ టాక్ వంటి యాప్స్ ఏమీ వాడాల్సిన పనిలేకుండా అతి త్వరలో అందరు భారతీయులకి ప్రత్యేకంగా తమ ఫేస్ బుక్ అకౌంట్ నుండే టిక్ టాక్ లో లాగా షార్ట్ వీడియోలను సృష్టించుకునే వెసులుబాటు రాబోతోంది.ఏది ఏమైనా టిక్ టాక్ మానియా ఇప్పట్లో భారత దేశ ప్రజలను మాత్రం వదులుకోలేరు.