ఈమధ్య కాలంలో అనేక ప్రదేశాలలో మనుషులు నివసిస్తున్న ఇంట్లోనే పాములు వాటి స్థావరాలను ఏర్పరచుకుని నివాసం ఉంటున్నాయి.ఈ మధ్య కాలంలో అనేక మంది ఇళ్లలో ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం కూడా.
ఇకపోతే తాజాగా హిమాచల్ రాష్ట్రంలోని ధర్మశాలలో ఉన్న గగ్గుల్ పోలీస్ స్టేషన్ లో ఏకంగా 16 నాగుపాములు దర్శనమిచ్చాయి.అయితే వారం రోజుల క్రితం అదే పోలీస్ స్టేషన్ లో ఓ నాగుపాము తిరగడాన్ని గమనించిన పోలీసులు వెంటనే పాములను పట్టుకునే వ్యక్తిని పిలిపించి ఆ పామును బయటికి పంపించేశారు.
అయితే ఇక సమస్య తొలగిపోయిందని భావించిన పోలీసులు, పోలీస్ స్టేషన్ లోని ఓ పోలీస్ కానిస్టేబుల్ మాత్రం మరో పాము తిరుగుతున్నట్లు అనుమానం చెందాడు.దీంతో మళ్లీ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ మరోసారి పాములు పట్టే వారిని పిలిపించి పోలీస్ స్టేషన్ ను మొత్తం వెతుకులాట చూపించారు.
దీంతో పాములు పట్టుకునేవారు స్టేషన్ ప్రతి మూల క్షుణ్ణంగా వెతికారు.పోలీస్ కానిస్టేబుల్ అనుమానించిన విధంగానే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 చిన్న నాగుపాములను కనుగొన్నారు.
ఆ చిన్న పాములు ఒక్కొక్క టి ఒక అడుగు నుంచి ఒకటిన్నర అడుగు వరకు పొడవు ఉన్నాయి.అయితే ఇవన్నీ ఒకే తల్లి బిడ్డలని పాములు పట్టుకునే వారు గుర్తించారు.
అలా పట్టుకున్న చిన్న పాములను అన్నిటిని కొన్ని డబ్బాలలో బంధించి తీసుకువెళ్లారు.ఆపై వాటిని అడవి ప్రాంతంలో వదిలేశారు.
ఒకవేళ ఆ పోలీస్ కానిస్టేబుల్ ఆ పాములు ఉన్న విషయాన్ని సీరియస్ గా తీసుకోక పోయిఉంటే నిజంగా పెద్ద ప్రమాదమే జరిగేది కాబోలు.