మరో క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన మహానటి కీర్తి సురేష్...!

రోజురోజుకి మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ తన అవకాశాల ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.ఇటు తెలుగులో, అటు తమిళ భాషలో భాష ఏదైనా సరే తానే నెంబర్ వన్ అని అంటోంది కీర్తి సురేష్.

 Keerthi Suresh, Mahanati, Heroien, Mahesh Babu, Selva Raghavan-TeluguStop.com

తెలుగు, తమిళ భాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన నటించడానికి అవకాశాన్ని పొందుతూ ముందుకు దూసుకు వెళుతోంది.

ఒకవేళ స్టార్ హీరో సరసన కాకపోయినా సరే… స్టార్ దర్శక నిర్మాతలతో కలిసి పనిచేస్తూ అగ్రహీరోయిన్ స్థానానికి చేరుకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది మహానటి కీర్తి సురేష్.

కంటెంట్ ఉండాలి కానీ ఎలాంటి సినిమా అయినా సరే తాను చేయగలనని నిరూపించడానికి ఆమె గట్టి ప్రయత్నమే చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా కీర్తి సురేష్ తనదైన ముద్రను వేయగల సత్తా తనది.

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్.

తాజాగా కీర్తి సురేష్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సినిమాను సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఆమె నటించబోతున్నారు.ఇందుకు సంబంధించి ఓ ముఖ్యమైన ప్రకటన తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులకు తెలియజేసింది.

ఆ పోస్టులు ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని కూడా పోస్ట్ చేసింది కీర్తి సురేష్.సాని కాయుధం అనే సినిమా టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.

దర్శకుడు సెల్వరాఘవన్ తో తాను పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలియజేశారు.ఇక తెలుగులో మహేష్ బాబు నటించిన పోతున్న సర్కార్ వారి పాట లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube