బానిస సంగేళ్ళు తెగి నేటికీ సరిగ్గా 74 సంవత్సరాలు అయ్యింది.నేడు భారతదేశం అంత స్వాతంత్ర్యదినోత్సవాన్ని ఎంతో సంబరంగా జరుపుకున్నారు.
కరోనా వైరస్ కారణంగా అన్ని చోట్ల నిబంధనల మధ్య వేడుకలు జరిగాయి.అయితే ఒకే వేదికపై పాడకపోయినా టెక్నాలజీ సాయంతో సినీ గాయకులు వారి దేశభక్తిని చూపించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే. 65మంది గాయకులు 5 భాషల్లో ఒక పాటను అద్భుతంగా వినిపించారు.”టుగెదర్ యాజ్ వన్” వచ్చిన ఈ పాటను రామ్ చరణ్ విడుదల చేశారు.టుగెదర్ యాజ్ వన్ విడుదల చేసిన రామ్ చరణ్ తనకు పాటను విడుదల చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని.
ఈ కరోనా పరిస్థితుల్లో మనలోని ఏకత్వాన్ని చూపిస్తున్నారు.65 సింగర్లు కలిసి పాట పాడటం మాములు విషయం కాదని రామ్ చరణ్ ట్విట్ చేశారు.ఇంకా పాటకు రాజశ్రీ సాహిత్యం అందించగా తమిళ్ లో వైరముత్తు, హిందీలో పీకే మిశ్రా, మలయాళంలో గోపాలకృష్ణన్లు రచించారు.అందరూ కూడా ఇళ్లలోనే ఉండి పాటను పాడారు.ఆ వీడియోను మీరు ఓసారి చూసేయండి.