రోడ్డుపైనే నిద్రపోయిన ఖడ్గమృగం.. ఎందుకంటే?

కరోనా వైరస్ ఒకపక్క దారుణంగా విజృంభిస్తుంటే మరోవైపు వరదలు బీభత్సము సృష్టిస్తున్నాయి.అసోంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు అన్ని పొంగిపొర్లుతున్నాయి.

 Corona Virus, Assam, Golaghat, Rhino, Kaziranga National Park, Forest Department-TeluguStop.com

దీంతో అనేక గ్రామాలు మునిగిపోయాయి.దీంతో ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

ప్రజలు మాత్రమే కాదు అనేక పశువు, పక్షులు కూడా వరదల దాటికి మృతి చెందాయి.

ఇంకా జంతువులుసైతం మృత్యువాతపడ్డాయి.

ఇప్పటికే గోలఘాట్‌లోని కాజీరంగా నేషనల్ పార్క్ లో 98 జంతువులుపైగా మృతి చెందినట్టు ప్రభుత్వం పేర్కొంది.ఇంకా ఈ నేపథ్యంలోనే పార్క్ నుండి ఓ ఖడ్గమృగం బయటకు వచ్చింది.

అయితే ఆ ఖడ్గమృగం బాగోరీ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బందర్ ధుబీ సమీపంలోని నేషనల్ హైవేపై ప్రత్యక్షమైంది.

Telugu Assam, Assam Floods, Corona, Forest, Golaghat, Rhino-

అక్కడ భారీ వర్షాలలో నానిపోయిన ఆ ఖడ్గమృగం అలసిపోయి రోడ్డు పక్కనే నిద్రపోయింది.ఇంకా ఆ ఖడ్గమృగంను చుసిన వాహనదారులు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు.దీంతో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగి.

తీవ్ర అస్వస్థతకు గురైన ఆ ఖడ్గమృగానికి అక్కడే చికిత్స అందించి పార్క్ లోకి తరలించారు.అనంతరం దానిని రెస్క్యూ కేంద్రానికి పంపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube